ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చిన ఆధార్ కేంద్రం తనిఖీ చేసిన తహసీల్దార్

దిలావర్‌పూర్, ఆగస్ట్ 06 (జనం సాక్షి) : గత రెండేళ్లుగా మూతపడి ఉన్న దిలావర్‌పూర్ మండల ఆధార్ నమోదు కేంద్రం తిరిగి అందుబాటులోకి వచ్చింది. దీంతో మండల ప్రజలు ఊరట చెందారు. ఆధార్ సేవల కోసం ఇన్నాళ్లు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా గత రెండు రోజుల క్రితం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆదార్ సేవలను పున్మప్రంబించరు. ఈ నేపథ్యంలో మండల కార్యాలయంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని గురువారం తహసీల్దార్ అజీజ్ అహ్మద్ అకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని పనితీరుపై ఆపరేటర్ వాజిద్ నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని, కార్యాలయ సమయపాలనను కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు. ఇంకా రేషన్ ఈ-కేవైసీ, ఆధార్ అప్డేట్ చేయించుకోని వారు వెంటనే వచ్చి పూర్తి చేయాలని ప్రజలకు సూచించారు. ఆధార్ సేవల్లో ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం వహించవద్దని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆయన వెంట ఈడిఎం నదీమ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.



