ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి : మంత్రి శ్రీధర్ బాబు
మంథని, (జనంసాక్షి) : ఉగ్రవాదులు మన స్ఫూర్తిని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు కానీ వారు భారతదేశ ఐక్యతను ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. పహల్గామ్ దాడిలో కోల్పోయిన అమాయక ప్రజల ప్రాణాలను గౌరవించేందుకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన మార్చ్‌లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఉగ్రవాద చర్యలు, ఇటువంటి సంఘటనల క్రూరత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారతదేశం కలిసి నిలుస్తుంది..బలంగా, దృఢంగా, స్థితిస్థాపకంగా అని అన్నారు. అలాగే భారతదేశం మానవత్వానికి కట్టుబడి ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో కేంద్ర ప్రభుత్వంతో అణచివేయాలన్నారు.