అయ్యప్ప మాల ధారణ స్వాములు భిక్షను స్వీకరించాలి.

 

 

 

 

 

ఆర్మూర్,నవంబర్ 20(జనంసాక్షి): ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టపై అయ్యప్ప ఆలయంలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలధారణ స్వాములు నిత్యాన్నదాన బిక్షను స్వీకరించాలని అయ్యప్ప మందిర నిర్మాణ కర్త,తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ కోరారు.ప్రతి రోజు నవంబర్ 16 నుండి డిసెంబర్ 26 వరకు నిత్యాన్నదాన బిక్ష కొనసాగుతుందని చెప్పారు. అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు మున్సిపల్, పరిసర ప్రాంత ప్రజలపై ఉండాలన్నారు.