పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం

ఇంటి స్లాబ్ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవంచ నరసింహా రెడ్డి

తలకొండపల్లి జూలై 20(జనంసాక్షి): పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవంచ నరసింహారెడ్డి అన్నారు.మండల కేంద్రంలో కల్వకుర్తి‌ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఆదివారం పోతుగంటి రాములమ్మ ఇందిరమ్మ ఇంటి స్లాబ్ కు పూజ చేసి పనులు ప్రారంభించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ..గత10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేదలకు ఇందిరమ్మ ఇల్లును నిర్మించి,సొంతింటి కలలను నిజం చేస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సత్యం,మీసేవ మల్లేష్,పోతుగంటి గణేష్,పోసారం గిరేందర్రె డ్డి,పురుషోత్తం,జంగయ్య,సురేష్,మహేష్,రమేష్,పెరుమాండ్ల శ్రీను,ఉపేందర్,బాలకృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు.