మొట్టమొదటి సర్పంచ్ ఏకగ్రీవం
రుద్రంగి(జనం సాక్షి):
తెలంగాణ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలామంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ కోసం గల్లి లీడర్లు ఆశగా చూస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రుద్రంగి మండలం ఉమ్మడి మానాల గ్రామం రూప్ల తండా లో మాత్రం సర్పంచ్ తోపాటు 8 వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచును ఎన్నుకోవడమే కాదు గెలుపు సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రోప్లా తండా గ్రామంలో సుమారు 390 మంది జనాభా ఉంటారు.అయితే నిధుల సమస్యలు లేకుండా తండాను అభివృద్ధి చేసి చూపిస్తానని గ్రామానికి చెందిన జవహర్లాల్ నాయక్ తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా జవహర్లాల్ నాయక్ ను అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తాండవాసులు తెలిపారు. జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ పంచాయతీగా రూపాండా పంచాయితీ నిలిచింది. సర్పంచ్ గా ఎన్నికైన జవహర్ లాల్ నాయక్ ను పంచాయతీ ప్రజలు అభినందించారు.పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తానని ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ గ్రామ నూతన సర్పంచ్ జవహర్ లాల్ నాయక్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో తండావాసులు పెద్దమనుషులు పాల్గొన్నారు.



