అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.
ఏటునాగారం,ఏప్రిల్ 17 (జనం సాక్షి).మండలంలోని శివాపురం శివారు గోగుపల్లి గ్రామానికి చెందిన గిలకత్తుల కిరణ్ గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సంఘం గ్రూప్లో పెట్టగా కల్లుగీత బంధువులు ఇచ్చిన విరాళాలతో 50 కిలోల బియ్యం తీసుకొని ఆ కుటుంబానికి అందజేసి పరామర్శించటం జరిగింది. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తాటి నవీన్ గౌడ్,చిక్కా అశోక్, గౌడ్ మండల నాయకులు మెరుగు రఘు గౌడ్ లు మాట్లాడుతూ కిరణ్ గౌడ్ మృతి సంఘానికి తీరనిలోటని అన్నారు. ఆయన కుటుంబానికి సంఘం ఎప్పుడు అండగా ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కప్పల వెంకన్నగౌడ్, బొల్లికొండ నారాయణ గౌడ్, కప్పల అశోక్ గౌడ్, బుడిగ శీనుగౌడ్, తాటి కృష్ణ గౌడ్, ఊరుగొండ రమేష్ గౌడ్, కప్పల నవీన్ గౌడ్ లతో పాటు 20 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.


