మడుగులపల్లి మండలం కనేకల్ రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా

మడుగులపల్లి, మే 07 ( జనం సాక్షి): మడుగులపల్లి మండలం కనేకల్ గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తూ కొందరు నిర్వాహకులు కాసుల వేటలో పడ్డారు భారీ టిప్పర్లతో అతి వేగంగా ప్రయాణిస్తూ, గ్రామంలోని రోడ్లను దుమ్ముమయం చేస్తున్నారు దీనివల్ల వాహనదారులు, ముఖ్యంగా గృహనిర్మాణాల్లో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దౌర్జన్యానికి దిగుతున్న నిర్వాహకులు.గ్రామస్తులు లేదా వాహనదారులు దుమ్ము లేవకుండా చూడాలని లేదా అతివేగం తగ్గించాలని టిప్పర్లను ఆపి ప్రశ్నిస్తే, నిర్వాహకులు మరియు డ్రైవర్లు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు మా ఇష్టం మాకు అడ్డొస్తే ఊరుకోం అంటూ స్థానికులను ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగుతున్నారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన వారిపైనే దౌర్జన్యం చేయడంపై గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారుఅధికారులు స్పందించాలి. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్నా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు, స్థానికులపై దౌర్జన్యం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి ఈ మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కనేకల్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

తాజావార్తలు