బైకును ఢీ కొట్టిన లారీ మహిళా మృతి, అత్త మృతి,అల్లుడికి తీవ్ర గాయాలు.
తలకొండపల్లి మే 06(జనంసాక్షి): తలకొండపల్లి నుంచి షాద్ నగర్ కి వెళ్లే ప్రధాన రహదారిపై బుధవారం అతివేగంతో ఉన్న లారీ ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో బైకు నడుపుతున్న యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పాటు వెనకాల కూర్చున్న మహిళ ప్రమాద స్థలంలోని మృతి చెందింది.ఈ ఘటనపై తలకొండపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జానకిరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తలకొండపల్లి మండల పరిధిలోని లింగరావుపల్లి గ్రామానికి చెందిన బక్కి జంగమ్మ (55) తన అల్లుడు వల్లింపుల కుమార్,తో కలిసి తలకొండపల్లికి బైకుపై వస్తుండగా తలకొండపల్లి నుంచి షాద్ నగర్ కు వెళ్లే లారీ అతివేగంగా రావడంతో కాటన్ మిల్ సమీపంలోని క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.మృతి చెందిన జంగమ్మ,ను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.గాయపడిన వల్లింపుల కుమార్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఓవైసీ ఆసుపత్రికి తరలించారు.మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ వెల్లడించారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి,జాగ్రత్తగా వాహనాలను నడపాలని,లేనిచో ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు పోయి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.



