హనుమాన్ మాలలో ఉన్న యువకుడు మల్లారెడ్డిపేట కోనేటిలో మునిగి మృతి

గంభీరావుపేట ఏప్రిల్ 07(జనం సాక్షి) : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని మల్లారెడ్డిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని బుధవారం అర్ధరాత్రి హనుమాన్ దేవాలయం ముందున్న కొలనులో పడి హనుమాన్ దీక్షలో ఉన్న ఓ యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అచ్చాయపల్లి గ్రామానికి చెందిన నీరాడి వినయ్ (16), సిద్దిపేటలోని తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు.ఈ క్రమంలోనే హనుమాన్ దీక్ష తీసుకున్న వినయ్, మరో ఎనిమిది మంది తోటి స్వాములతో కలిసి మల్లారెడ్డి పేట లోని హనుమాన్ ఆలయ దర్శనానికి వచ్చాడు. ఆలయ ప్రాంగణంలోని కొలనులో స్నానం చేసేందుకు దిగిన వినయ్కు ఈత రాకపోవడంతో ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వినయ్ నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని వెలికి తీసి శవ పరీక్ష నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం..

తాజావార్తలు