బెంగాల్‌లో బీజేపీ ఘనవిజయం

` కేరళలో యÖడీఎఫ్ విజయఢంకా
` తమిళనాట ‘విజయ’కేతనం
` అస్సాంలో ఎన్డీయే హ్యాట్రిక్
` ఎన్డీయే ఖాతాలో పుదుచ్చేరి
` సిట్టింగ్ స్థానాల్లో ఓటమిపాలైన స్టాలిన్, మమత
న్యూఢిల్లీ(జనంసాక్షి): ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చాయి. అసోం, పుదుచ్చేరిలో అధికారం నిలుపుకున్న బిజెపి, బెంగాల్లోనూ విజయభేరి మోగించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యÖడిఎఫ్ విజయం సాదించింది. తమిళనాట విజయ్ నేతృత్వంలోని టివికె అనూహ్యంగా దూసుకుని వచ్చింది. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగింది. డీఎంకే, అన్నాడీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమÖల్ కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ భాజపా దూసుకెళ్లింది. కేరళలో యÖడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 104 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే 62, అన్నాడీఎంకే 68 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 293 స్థానాలకు గానూ.. భాజపా దాదాపు 205 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 85 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. కేరళలో 140 స్థానాలుండగా.. యÖడీఎఫ్ 100 సీట్లను గెల్చుకుంది.. ఎల్‌డీఎఫ్ 32 స్థానాల్లో, ఎన్డీయే 3చోట్ల గెలుపొందింది. అస్సాంలో 126 స్థానాలుండగా.. భాజపా 100కు పైగా సీట్లతో హ్యాట్రిక విజయాన్ని నమోదు చేసింది. స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 26 చోట్ల ముందంజలో ఉంది. పుదుచ్చేరీలో 30 స్థానాలకు గానూ ఎన్నార్ కాంగ్రెస9 చోట్ల గెలిచి 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 చోట్ల గెలిచి.. 5 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తంగా బిజెపి తనకున్న రెండు రాష్టాలకు తోడు బెంగాల్లో పాగా వేసింది. కేరళలో పదేళ్ల తరవాత మళ్లీ కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. తమిళనాట ద్రవిడ పార్టీలకు పరాభవం తప్పలేదు.
బెంగాల్‌లో పాగా వేసిన బిజెపి
బెంగాల్ దంగల్‌లో బిజెపి గెలిచింది. అనుకున్నట్లుగానే మమతను మట్టి కరిపించింది. టీఎంసీ కంచుకోటను భాజపా బద్దలు కొట్టింది. 15 ఏళ్లుగా ఎదురులేకుండా బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీకి గట్టి షాకిచ్చింది. గత రెండు దఫాల్లో సాధ్యంకాని విజయం ఈసారి కమలనాథుల వశమైంది. పశ్చిమబెంగాల్ లో అనుసరించిన పదునైన వ్యూహం ఈసారి పార్టీకి కచ్చితమైన ఫలితాన్ని తీసుకొచ్చింది. భాజపా అగ్రనేత అమిత్‌షా అన్నీ తానై ఈ ఎన్నికల్లో పార్టీని నడిపించారు. మొత్తం 293 స్థానాల్లో 205 స్థానాల్లో బిజెపి ఘన విజయం సాధించింది. మమతా బెనర్జీ పార్టీ 85 స్థానాలకు పరిమితం అయ్యింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అంచనాలను తలకిందులు చేస్తూ మమతా బెనర్జీ సత్తా చాటారు. నాడు భాజపా 10,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో 40 స్థానాలు, 5,000 కంటే తక్కువ ఓట్లతో 20 స్థానాలు కోల్పోయి 77 స్థానాలకే పరిమితమైంది. దీంతో దీదీని ఓడించడం అంత సులువు కాదని గ్రహించిన భాజపా వ్యూహాన్ని మార్చుకొంది. సునీల్ భన్సల్ పార్టీ ఇన్‌ఛార్జిగా.. వ్యవస్థీకృత మార్పులు తీసుకొచ్చారు. అమిత్‌షాకు భన్సల్ నమ్మకస్తుడని పేరు. టికెట్ల పంపిణీ విషయంలో సెలబ్రిటీలు, ఫిరాయింపుదార్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా క్షేత్రస్థాయిలో పట్టున్న పార్టీ నాయకులకు భాజపా పెద్దపీట వేసింది. ప్రతి బూత్‌స్థాయిలో 300 ఓట్లను సవిÖకరించగల వారికే టికెట్లు కేటాయించింది. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట్ల పుంజుకోవడానికి బూత్ స్థాయి మేనేజ్‌మెంట్‌కు తెరతీసింది. పోలింగ్ కేంద్రాల్లో బలమైనవి, దృష్టిపెట్టాల్సినవి, బలహీనమైనవి అంటూ మÖడు వర్గీకరణలు చేసింది. ఇక్కడే ’పన్నా ప్రముఖ’ వ్యవస్థ పనిచేసింది. ప్రతి కార్యకర్త 10`15 కుటుంబాలతో సత్సంబంధాలు నెరిపి 30`60 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేలా చేశారు. దీంతోపాటు భాజపా ’శక్తికేంద్రాలు’గా వర్గీకరించుకొన్న క్లస్టర్ల నుంచి అధిక పోలింగ్ ఉండేలా నిర్దేశిరచారు. ఇక అమిత్‌షానే స్వయంగా 152కు పైగా నియోజకవర్గాల్లోని 44,000 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగిన సమావేశాలను పర్యవేక్షించారంటే భాజపా ఏ స్థాయిలో దృష్టిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. పన్నా ప్రముఖ్ నెట్‌వర్క్‌ను సునీల్ భన్సల్ చూసుకోగా.. బూత్ స్థాయి సమన్వయ బాధ్యతలను భూపేంద్ర యాదవ్ స్వీకరించారు. ఫలితంగా బెంగాల్‌లో రికార్డ్ స్థాయిలో దాదాపు 92శాతం పోలింగ్ నమోదైంది. ఇది భాజపాకు కచ్చితంగా కలిసొచ్చింది. బూత్ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలు
మమత సర్కారు వైఫల్యం, శాంతి భద్రతల పరిస్థితి, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచారం వంటివి ప్రస్తావించారు. ఇక ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలి తల్లికి కూడా పానిహటి నుంచి భాజపా టికెట్ కేటాయించి.. ఆ అంశాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది. దీంతో మమతా విజయావకాశాలను దెబ్బకొట్టినట్లయ్యింది. పశ్చిమ బెంగాల్‌లో 70శాతం ఉన్న హిందూ ఓటర్ల ఏకీకరణెళి లక్ష్యంగా భాజపా పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను దృష్టిలోపెట్టుకొని వ్యూహాలను అమలు చేసింది.
2021 ఎన్నికల వేళ నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసి భాజపా దెబ్బతింది. ఈసారి మాత్రం ఆ తప్ప్పు చేయలేదు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిని లక్ష్యంగా చేసుకొని భాజపా శ్రేణులు ప్రచారం చేశాయి. 220 నియోజకవర్గాల్లోని టీఎంసీ ఎమ్మెల్యేలపై ’ఛార్జిషీట్లు’ విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. 10,000 కిలోవిÖటర్ల మేరకు భాజపా పరివర్తన్ యాత్రను చేపట్టింది. ఫలితంగా 77 మంది అభ్యర్థులను టీఎంసీ మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈసారి ఎన్నికల్లో మమతా బెనర్జీకి మొదటి నుంచి అనుకూలించలేదు. ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే టీఎంసీ అనుకూల అధికారుల బదిలీలు, ఐప్యాక్‌పై ఈడీ దాడులు దీదీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికితోడు ప్రతి 140 మంది ఓటర్లకు ఒక సిబ్బంది చొప్ప్పున మొత్తం 2.4 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఈ నిర్ణయంతో పశ్చిమబెంగాల్‌లో అధికార పార్టీల కార్యకర్తలకు సహజంగా ఉండే దూకుడుకు క్లళెం వేసిన్లటైంది. దీనికితోడు సర్ విషయంలో న్యాయస్థానాల వద్ద మమత సర్కారు చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. పశ్చిమబెంగాల్‌లో మహిళా ఓటర్లను ఆకట్టుకొన్న పార్టీకే విజయం లభిస్తుంది. ఇప్పటికే టీఎంసీ నుంచి వారికి లక్క్ష్మీభాండార వంటి పలు పథకాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళా సాధికారతే తమ మ్యానిఫెస్టో లక్ష్యమంటూ భాజపా అగ్రనేత అమిత్‌షా ప్రకటించారు. అంతేకాదు, ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఇస్తామని హావిÖ ఇచ్చారు. ప్రస్తుతం మమత సర్కారు ఇస్తున్న దానికిది రెట్టింపు. గర్భిణులకు రూ.21,000, మహిళలకు ఉచిత బస్సు, ప్రభుత్వ ఉద్యోగాల్లో స్తీలకు 33శాతం రిజర్వేషన్, యువతకు నెలకు రూ.3,000 భృతి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఏక మొత్తంగా రూ.15,000 మద్దతు ప్రకటించింది. వరిని క్వింటాల్ రూ.3,100కు కొనుగోలు వాగ్దానం, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రాష్ట్ర వాటా పెంచి రైతులకు ఏటా రూ.9,000 చెల్లించేట్లు ఇచ్చిన హావిÖలు ఆకర్షించాయి. త్తర బెంగాల్‌పై పట్టు బిగించి.. సహజంగానే ఉత్తరబెంగాల్‌లో భాజపాకు పట్టుంది. ఇక్కడ తేయాకు తోటల సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న రాజబోంగ్షీల సమస్యలపై పార్టీ ఈసారి దృష్టిపెట్టింది. వీరి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుంది. ఇక్కడ 2 శాతం ఓట్లు పెరిగినా.. ఈ ప్రాంతంలో తమ సీట్లను 40కు పైగా పెంచుకొనే అవకాశాన్ని గ్రహించి వాడుకొంది. స్వయంగా అమిత్‌షా ఈ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు. శాంతిభద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో భాజపా తనదైన శైలిలో ప్రచారం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100? కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించింది. పశువుల అక్రమ రవాణా, అక్రమ చొరబాట్లను అణచివేస్తామన్న హావిÖలు ఓటర్లపై పనిచేశాయి. పశ్చిమబెంగాల్‌లో ’బయటవారు’ అన్న ముద్ర పోగొట్టుకోవడానికి భాజపా ప్రచారంలో కూడా జాగ్రత్తలు తీసుకొంది. సువేందు అధికారి, సుకాంత్ మజుందార్, దిలీప్ ఘోష్ వంటివారిని ముందుంచి ప్రచారం చేయించింది. కీలక ప్రాంతాల్లో మాత్రం కేంద్ర నేతలే ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో ఏకంగా 66 ర్యాలీలు చేపట్టారు. ప్రధాని మోదీ 18 కార్యక్రమాల్లో, జేపీ నడ్డా 10 ర్యాలీల్లో ప్రచారాన్ని నడిపించారు. ఇలా వ్యూహాత్మకంగా మమతను దెబ్బకొట్టారు.
కేరళలో మÖడు సీట్లు గెల్చుకున్న బిజెపి
కేరళలో పదేళ్ల తర్వాత భాజపా ఖాతా తెరచింది. నేమోం, చాతన్నూర్, కాళకూటం అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. తమకు ఒక్క సీటు కూడా రాదని కాంగ్రెస్, సీపీఎంలు చేసిన వ్యాఖ్యలకు ఈ ఫలితాలే సమాధానమని కాషాయ పార్టీ కేరళ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తాను పోటీ చేసిన కంజిరప్పల్లిలో మÖడో స్థానంలో నిలిచారు. నేమోం స్థానంలో రాజీవ్ చంద్రశేఖర్ తన సవిÖప అభ్యర్థిపై 4,978 ఓట్ల తేడాతో గెలుపొందారు. చాతన్నూర్‌లో బీబీ గోపకుమార్ 4,398 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాళకూటంలో కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్ 428 ఓట్ల తేడాతో గ్టటెక్కారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భాజపా తొలిసారి 2016లో ఓ సీటు సాధించింది. నేమోం నియోజకవర్గం నుంచి సీనియర్ నేత రాజగోపాల్ గెలిచారు. 2021లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. తాజా ఫలితాల్లో 102 స్థానాల్లో విజయంతో యÖడీఎఫ్ సెంచరీ కొట్టినట్లయ్యింది. 2021 ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలిచిన ఎల్డీఎఫ్.. ఈ సారి 35కే పరిమితమైంది. ధర్మదం నుంచి పోటీ చేసిన సీఎం పినరయి విజయ్ 19,247 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అసోంలో బిజెపి హ్యాట్రిక్ విజయం
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. 126 స్థానాలు ఉన్న అసోంలో బిజెపి వందకు పైగా సీట్లను గెల్చుకుని తిరుగులేదని నిరూపించింది. ఇక్కడ కాంగ్రెస్ నేత గోగోయ్ అపజయం పాలయ్యారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. హిమంత సైతం తన సొంత నియోజకవర్గమైన జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 89,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన బిదిష నియోగ్‌కు 31,951 ఓట్లు పోలయ్యాయి. హిమంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2021 నుంచి అస్సాంలో బీజేపీకి కీలకనేతగా నిలిచారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను వ్యతిరేకించడం, ఆదివాసీ భూములను చొరబాటుదారుల నుంచి విముక్తి కలిగించడంతో ముఖ్యమంత్రిగా అన్ని ప్రధాన వర్గాలుగా చేరువయ్యారు. ముఖ్యంగా చికెన్‌నెక్ కారిడార్‌పై బంగ్లా ప్రకటనలు తిప్పికొట్టడం, బెలూచిస్థాన్ స్వాతంత్ర పోరాటానికి మద్దతుగా నిలవడం, అసాంలో వరద నివారణ చర్యలు తీసుకోవడం వంటి చర్యల ద్వారా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లా చొరబాట్లకు పూర్తి అడ్డుకట్ట వేస్తామని, ఎనఆర్‌సీని కచ్చితంగా అమలవుతుందని ఆయన చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. ప్రధానమంత్రి మోదీ సైతం హిమంత్ బిశ్వ శర్మ ప్రచారానికి దన్నుగా నిలవడంతో అస్సాంలో బీజేపీ తిరుగులేని విజయాన్ని మరోసారి సొంతం చేసుకుంది.

 

తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
` ఇండియా కూటమికి ఈ ఫలితాలు చెంపపెట్టు
` బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు
హైదరాబాద్(జనంసాక్షి): తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇండియా కూటమికి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఈ ఫలితాలను చూస్తే తెలంగాణలోనూ భాజపా అధికారంలోకి వస్తుందనేది స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. గత 33 ఏళ్లు కమÖ్యనిస్టులు, 15 ఏళ్లు తృణమÖల్ పాలించిన బెంగాల్ కోటలో భాజపా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.అస్సాంలో మÖడోసారి భాజపా కూటమి అధికారంలోకి వస్తోందన్నారు. కుటుంబ రహిత, అవినీతి రహిత పాలన అందించాం కాబట్టే.. అస్సాంలో మళ్లీ తమ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. ఉత్తరాది, దక్షిణాది వైషమ్యాలు సృష్టించిన ఇండియా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తమిళనాడులో అధికార డీఏంకే పార్టీ తుడిచి పెట్టుకుపోతుందన్నారు. కూకట్‌పల్లి నుంచి మైనార్టీలు భాజపాలో చేరారని.. ముస్లిం మహిళలు మోదీని పెద్దన్నగా భావిస్తున్నారన్నారు. మే 10న పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభకు పెద్దఎత్తున జనం తరలిరావాలని పిలుపునిచ్చారు.
స్థానిక వ్యతిరేకతతోనే కేరళలో కాంగ్రెస్ విజయం: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య
దేశమంతా ఇక డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నో అరాచకాలు జరిగాయని.. బంగ్లా చొరబాటు దారులకు దారులు మÖసుకుపోయాయని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశం అంతా బీజేపీని కోరుకుంటోందని ఉద్ఘాటించారు. సోమవారం కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విÖడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కలలు కంటున్నారని అన్నారు. సీఎం ఎక్కడికి వెళ్తే.. అక్కడ కాంగ్రెస్‌కు ఓటమినేనని ఎద్దేవా చేశారు. కేరళంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోనే.. ఈ ఫలితాలు కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్ప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రావాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు. బీజేపీకి అసలు ప్రచారకర్త రాహుల్ గాంధీనేనని బండి సంజయ్ సెటైర్లు గుప్పించారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్టాల్లోనూ మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం ఆయన విÖడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి.. ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. దుకాణం యాజమాన్యంతో మాట్లాడానని, బాధితులకు అండగా నిలవాలని కోరానని అన్నారు.

 

ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా
ఏడింటిలో నాలుగు కైవసం
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశంలో ఐదు రాష్టాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడు తున్న తరుణంలోనే దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లోనూ బిజెపి సత్తా చాటింది. ఆయా రాష్టాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలూ వెలువడ్డాయి. ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతిచెందడం వల్ల ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మహారాష్ట్రలో రాహురి, బారామతి; కర్ణాటకలో బాగల్‌కోట్, దావణగెరె సౌత;్ గుజరాత్‌లో ఉమ్రత్, నాగాలాండ్‌లో కోరిడాండ్, త్రిపురలో ధర్మనగర్‌లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా వీటి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ ఏడింట్లో నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేయగా.. మరో మÖడింట్లో కాంగ్రెస్ గెలుపొందింది.మహారాష్ట్రలో ఉన్న బారామతి అసెంబ్లీ స్థానం.. రాజకీయ పలుబడి ఉన్న పవార్ కుటుంబానికి కంచుకోట. సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ పవార్ జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య, నేషనలిస్ట్ కాంగ్రెస్ అజిత్ వర్గం అభ్యర్థి సునేత్ర అజిత్ పవార్ ఆ స్థానం నుంచి పోటీ చేశారు. 2,18,034 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మరో స్థానం రాహురిలో కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ మొకాతెపై 1,12,587 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావ్ ఘన విజయం సాధించారు. ఇక.. కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో కాంగ్రెస్ నేత ఉమేశ్ హుళ్లప్ప మేటి 22,332 ఓట్ల తేడాతో బీజేపీపై గెలుపొందారు. బీజేపీ తరఫున చరన్‌మితత్ వీరభద్రయ్య(వీరన్న) పోటీ చేశారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్‌లోనూ కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. బీజేపీ అభ్యర్థి శ్రీనివాస టి.దాసకరియప్పపై 5,708 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ మల్లికార్జున విజయం సాధించారు.గుజరాత్‌లోని ఉమ్రత్‌లో బీజేపీ అభ్యర్థి హర్షత్‌భాయ్ గోవింద్‌భాయ్ పర్మార్ 30,743 ఓట్ల తేడాతో కాంగ్రెస్ నేత భృగురాజ్ సింగ్ చౌహాన్‌పై ఘన విజయం సాధించారు. హర్షద్ పర్మార్‌కు 85,500 ఓట్లు రాగా, భృగురాజ్‌కు 54,757 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గోవింద్ పర్మార్ మృతిచెందిన కారణంగా ఈ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అక్కడ గోవింద్ కుమారుడు, హర్షత్ భాయ్ విజయం సాధించడం విశేషం. నాగాలాండ్‌లోని కోరిడాండ్‌లో బీజేపీ అభ్యర్థి దావోచియర్ ఐ.ఇమ్‌చన్, ఇండిపెండెంట్ అభ్యర్థి తోషికాబా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థి తోషికాబాపై 3,123 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దావోచియర్ గెలుపొందారు. త్రిపురలోని ధర్మనగర్‌లో సీపీఐ(మార్క్సిస్ట్) అభ్యర్థి అమితాబ్ దత్తపై 18,290 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి జహర్ చక్రబరోటి విజయం సాధించారు.

బెంగాల్‌లో విజయం అందించి భారత రాజ్యాంగాన్ని గెలిపించారు
` ఐదు రాష్ట్రాల్లో చారిత్రక ఎన్నికలు జరిగాయి
` బెంగాల్ విజయంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి
` గంగానది, బ్రహ్మపుత్రల ఆశీర్వాదమే ఈ విజయం
` అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం ఈ ఎన్నికల విశేషం
` తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు అండగా ఉంటా
` బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవంలో మోడీ
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇవాళ భాజపా చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐదు రాష్టాల ప్రజలు భారత రాజ్యాంగాన్ని గెలిపించారని అన్నారు. ఇది ప్రజలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రజలకు ధన్యవాదాలు. అని ప్రధాని అన్నారు. నాలుగు రాష్టాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ దిల్లీలోని భాజపా కార్యాలయానికి సంప్రదాయ పంచెకట్టుతో వచ్చారు. పశ్చిమబెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విజయోత్సవ సంబరాల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. బెంగాలీ ధోతితో విచ్చేసిన ప్రధానికి పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ’మోదీ మోదీ’ నినాదాలతో కార్తకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, బెంగాల్ బీజేపీ విజయంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆత్మకు ఉపశమనం కలిగిందన్నారు. పార్టీ కార్యకర్తల సంబరాల్లో నేనూ పాల్గొంటున్నా. బెంగాల్‌లో 93 శాతం పోలింగ్‌తో సరికొత్త రికార్డు సృష్టించారు. తమిళనాడు, కేరళలోనూ పోలింగ్ శాతం బాగా పెరిగింది. దేశంలో 20కిపైగా రాష్టాల్లో భాజపా, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. గంగానది ప్రవహించే ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకూ నెగ్గాం. గంగానది ఆశీర్వాదం వల్లే ఈ విజయాలు దక్కాయి. బ్రహ్మపుత్ర ఆశీర్వాదం వల్ల అస్సాంలోనూ హ్యాట్రిక్ సాధించాం. పుదుచ్చేరిలో 2021లో ఇచ్చిన హావిÖలను మేం నెరవేర్చాం. బెంగాల్‌లో గెలుపుతో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి లభిస్తుంది. ఇక నుంచి బెంగాల్‌లో భయాందోళనలు ఉండవని ప్రకటించారు. సుపరిపాలన అందించినందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు. తమ రాష్టాలు అభివృద్ధి చెందాలంటే భాజపా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. భాజపా అంటేనే అభివృద్ధి.. సంక్షేమం అని మోదీ పేర్కొన్నారు.బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన, చారిత్రక తీర్పునిచ్చారని, ఆ ఆనందం కార్యకర్తల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్‌లో నూతన చరిత్రను ఆవిష్కరించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టాక ఆయన మార్గదర్శకంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవంటూ ఆయనకు అభినందనలు తెలిపారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకూ ప్రతిచోట కమలం వికసించిందని, కామాక్ష అమ్మవారి ఆశీర్వచనం పుష్కలంగా లభించిందని చెప్పారు. అభ్యుదయ బెంగాల్ కోసం ఆయన కలలుగన్నారని, అది ఇన్నేళ్ల తర్వాత వాస్తవరూపం దాల్చిందని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారని చెప్పారు. బెంగాల్‌లో మార్పుకోరుతూ పవనాలు బలంగా వీచాయని పేర్కొన్నారు. బీజేపీ అంటేనే సుపరిపాలన అనే విషయం ప్రజలకు బాగా తెలుసునని ప్రశంసించారు. స్సాంలో బీజేపీ`ఎన్డీయేను ప్రజలు మరోసారి ఆశీర్వదించారని, అభివృద్ధికి ప్రజలు బాసటగా నిలిచారని ప్రధాని కొనియాడారు. తిరుగులేని తీర్పునిచ్చిన అస్సాం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సర్వోతో ముఖాభివృద్ధికి భరోసాగా ఉంటామన్నారు. దశాబ్దాలుగా పార్టీ, కూటమి ఎదుగుదలకు అవిశ్రాంతంగా కృషి చేసిన బీజేపీ`ఎన్డీయే కార్యకర్తలను అభినందించారు. ముఖ్యమంత్రి ఎన్.రామస్వామి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం టాక్ రికార్డు, సుపరిపాలనకు మరోసారి పట్టం కట్టిన పుదుచ్చేరి ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలకు అభినందనలు చెప్పారు. కేరళలో విజయం సాధించిన యÖడీఎఫ్‌కు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. బీజేపీ`ఎన్డీయేకు ఓటు వేసిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కేరళ ప్రగతి కోసం, వికసిత కేరళం విజన్ సాకారం కోసం తాము పనిచేస్తామని చెప్పారు. కేరళం ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకు తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. తమిళనాడులో మంచి ఫలితాలు సాధించిన విజయ్ టీవీకేను ప్రధాని అభినందించారు. ఎన్డీయేకు మద్దతుగా ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసమస్యలు, వారి జీవనప్రమాణాల మెరుగుదలకు తాము ఎప్ప్పుడూ ముందుంటామని చెప్పారు. తమిళనాడు ప్రగతి, ప్రజాక్షేమానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జెపి నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి తదితరులు పాల్గొన్నారు.

 

‘సర’ పేరుతో ఓట్లను దొంగిలించిన మోడీ
` బెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంపై సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు
కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భాజపా 190 స్థానాల్లో ముందంజలో ఉండడంతో అక్కడ బిజెఇప ప్రభుత్వ ఏర్పాటు దాదాపుగా ఖాయమయ్యింది. ఈ క్రమంలో సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన విడుదల చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో భాజపా ఓట్లను దొంగిలించిందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ’ఏజెంట్లు, అభ్యర్థులు ఎవరూ కౌంటింగ్ కేంద్రాలను విడిచి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భాజపా పథకం. మొదటి రెండు, మÖడు రౌండ్లలో వారే ఆధిక్యంలో ఉన్నట్లుగా చూపిస్తారని నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. కొన్నిచోట్ల రెండు, మÖడు రౌండ్ల తర్వాత కౌంటింగ్ ఆపేశారు. టీఎంసీని అణచివేసేందుకు కేంద్ర బలగాలను బలవంతంగా ఉపయోగిస్తున్నారు. సీట్ల ఆధిక్యంపై తప్ప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘం కేంద్ర బలగాలతో కలిసి ఇష్టానుసారం వ్యవహరిస్తోంది. రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర బలగాలకు పూర్తిగా లొంగిపోయారు’ అని మమత ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏజెంట్లు, కార్యకర్తలు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయని.. తుది ఫలితాల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా.. 293 సీట్లకు ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. 190 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 97 స్థానాల్లో, కాంగ్రెస్ 1 చోట ఆధిక్యంలో ఉన్నాయి.ఈ క్రమంలో ఎన్నికల కౌంటింగ్‌కు ముందు బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయన్నారు. సీసీ టీవీలు కూడా ఆఫ్ అయ్యాయని పేర్కొన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్టాంగ్ రూమ్‌లు ఉంచిన ప్రదేశాలకు వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ బీజేపీ అదేశాల మేరకే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు నెలకున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్ కోసం అధికారులను డిమాండ్ చేయాలని కేడర్‌ను పశ్చిమ బెంగాల్ సీఎం కోరారు. మరోవైపు కోల్‌కతాలోని ఖుదీరామ్ అనుశిలిని స్టేడియంలో కెమెరా ఆఫ్ చేసి ఉన్న కంప్యూటర్ స్క్రీన్ వీడియోను మమత కేబినెట్‌లోని మంత్రి శశి పంజా తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. వీడియో ఆఫ్ చేసిన ఫుటేజ్ తమకు చూపించాలని అధికారులను తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు. శ్యామ్‌పుకూర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా శశి పంజా బరిలో నిలిచారు.

 

కేరళలో కాంగ్రెస్ గెలుపు వెనక సీఎం రేవంత్ పదునైన వ్యూహం
` యÖడీఎఫ్ విజయంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
` కూటమి నాయకులు, కార్యకర్తలు విజయం సాధించినందుకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి
హైదరాబాద్(జనంసాక్షి):కేరళలో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యÖడీఎఫ్ కూటమి నాయకులు, కార్యకర్తలు విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయానికి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ, మల్లికార్జున్? ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలియజేశారు. కేరళలో ప్రచారం సందర్భంగా తనపై తమ ప్రేమను కురిపించిన యÖడీఎఫ్ మద్దతుదారులకు, కేరళ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలందరి తరఫున తాను వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని అన్నారు. మనం అభివృద్ధిని విశ్వసిస్తామని, ఒక దశాబ్దం పాటు నిరాశ, ద్రోహం తర్వాత కాంగ్రెస్? ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక గొప్ప భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్? రెడ్డి ట్వీట్ చేశారు.కేరళం కాంగ్రెస్ విజయంలో రేవంత్ రెడ్డి పాత్ర : కేరళలో కాంగ్రెస్ విజయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వెల్లడించారు. యÖడీఎఫ్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కేరళ సీఎం విజయన్‌ను వారి సమయం అయిపోయిందని, వెళ్లిపో అని నేరుగా విమర్శించారని గుర్తు చేశారు. కేరళ అభివృద్దిని ఎక్కువ చేసి చూపించిన విజయన్‌ను నిలదీయడంతో పాటు లేఖలు కూడా రాశారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూడమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, రుణమాఫీ, ఉచిత బస్సు, సన్న బియ్యం వంటి కార్యక్రమాలను ప్రచారంలో వివరించారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
కేరళలో విజయం.. తెలంగాణ కాంగ్రెస్‌కు మరింత బలం: మహేశ్ కుమార్ గౌడ్
కేరళలో కాంగ్రెస్ విజయం వెనక రేవంత్‌రెడ్డి వ్యూహాలు: అద్దంకి దయాకర్
హైదరాబాద్: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యÖడీఎఫ్ ఘన విజయం సాధించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. కేరళలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నాయకులు ప్రచారం నిర్వహించడం.. తెలంగాణ పాలన చూసి ఓట్లు వేయాలని కోరడం చాలా ప్రభావం చూపించిందన్నారు. కేరళలో విజయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని.. మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగించిందని వెల్లడించారు. తమిళనాడులో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్‌కు అభినందనలు తెలిపారు. ఈ ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి సవిÖక్ష చేసి.. మరింత బలోపేతం అయ్యేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించింది. ఈ విజయం వెనక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. యÖడీఎఫ్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహారించారని పేర్కొన్నారు. కేరళ సీఎం విజయన్‌పై.. రేవంత్ రెడ్డి నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారని గుర్తు చేశారు. కేరళ అభివృద్ధిపై విజయన్‌ను నిలదీయడంతోపాటు లేఖలు కూడా రాశారని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ప్రచారంలో రేవంత్‌రెడ్డి వివరించారన్నారు.ఒక్క డైలాగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల దశను మార్చారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కొనియాడారు. ఆయన బ్రాండ్ కేరళలో ఉపయోగపడిందన్నారు. విజయన్ టైం అయిపోయిందని రేవంత్ ముందే చెప్పారని గుర్తు చేశారు. కేరళ ఎన్నికల్లో ఆయన ప్రసంగాలు పార్టీ అభ్యర్థుల విజయాలకు దోహదపడ్డాయన్నారు.కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలను తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేరళ ప్రజలకు వివరించారన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.

తాజావార్తలు