గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

 

 

 

 

హాజరైన, మాజీ ఎంపీ వినోద్,
నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, తోట ఆగయ్య, నర్సింగరావు.

గంభీరావుపేట ఏప్రిల్ 07 (జనం సాక్షి):

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామం లొ నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి పునర్ ప్రతిష్ట తోపాటు సీతారాములు,వెంకటేశ్వర, ఆంజనేయ,నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలొ ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, తోట ఆగయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చీటీ నరసింహారావు, కృష్ణారెడ్డి,లక్ష్మణరావు,నాగరాజు లక్ష్మణ్ బిఆర్ఎస్ పార్టీ మండల పట్టణ నాయకులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు , కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ, ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని పంటలు బాగా పండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల జిల్లా నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు