‘నువ్వు లేక నేను లేను’ అంటూ భార్య చెంతకు వెళ్లిపోయిన భర్త
రాజోలి, అక్టోబర్ 02 (జనంసాక్షి) : గత నెల సెప్టెంబర్ 6వ తేదీన భార్య పురుగుల మందు తాగి చనిపోగా..ఆమే లేదనే నిజాన్ని జీర్ణించుకోలేక భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజోలి ఎస్ఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పెద్ద ధన్వడ గ్రామానికి చెందిన తెలుగు వీరేష్ (26) గత 10 నెలల క్రితం గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామానికి చెందిన భీమక్కతో వివాహమైంది. గత నెల 6వ తేదీన వీరేష్ తన భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లగా అక్కడ కుటుంబ కలహాలతో భార్య భీమక్క పురుగుల మందు తాగి మృతి చెందింది. భార్య మృతి జీర్ణించుకోలేక భర్త ఆమె లేని జీవితం ఎందుకని గత నెల 25 తేదీన పురుగుల మందు తాగడంతో హుటాహుటిన కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. బుధవారం రోజున మృతుడి తల్లి తెలుగు భీమమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.