బాబాసాగర్ ప్రధాన రహదారి పై ట్రాక్టర్ బోల్తా

ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు నాల్గురు వ్యక్తులు సురక్షితం
చింతలమానేపల్లి, జూలై 7: ( జనం సాక్షి )మండలంలోని బాబాసాగర్ గ్రామ సమీ పంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి రేంజ్ ఫారెస్ట్ (అటవీ శాఖ) పనుల నిమిత్తం ఫెన్సింగ్ వైర్లు అమర్చేందుకు సిమెంట్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బాబా సాగర్ గ్రామ సమీపంలోని మూలమ లుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కెరమెరి మండలం నెహ్రునగర్కు చెందిన కూలీలు చల్లా అశోక్ (56), పండిత్ (55) అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ షాదుల్తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్తంభాల కింద ఇరుక్కున్న వారిని స్థాని కులు బయటకు తీసి 108కు సమాచారం అందించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో డ్రైవర్, ఏడుగురు కూలీలు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తర లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అతివేగం ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు



