పెద్దపల్లి జిల్లాలో విషాదం

 

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రామగిరి మండలం రాంనగర్‌లో అర్ధ రాత్రి చోటు చేసకుంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన తల్లి, కూతుళ్లు కాలువల పోషమ్మ(65), గడ్డం కొమురమ్మ(45) సజీవ దహనమయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఒకేసారి మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.