సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత

హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి వచ్చిన (వినియోగదారులు) మరో ఇద్దర్ని పట్టుకోవడం జరిగిందని వనస్థలిపురం ఎస్హెచ్ఓ రవిబాబు తెలిపారు. సాహెబ్ నగర్ లోని గాయత్రి నగర్ లో ఒక రూమ్ లో రెండు కేజీల గంజాయినీ దాచి ఉంచి, త్రాగడానికి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు అమ్ముతున్నారని, విశ్వాసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి సోదా చేయుటకు పర్మిషన్ తీసుకొని, ఇంటిలో సోదా చెయ్యగా రెండు కేజీల గంజాయిని, మిరియాల లెనిన్, మొహమ్మద్ ఉమర్, ఎడవెల్లి మనోజ్ కుమార్, ముగ్గురు వ్యక్తులు అమ్ముతుండగా, మరొ ఇద్దరూ తండు నవీన్, గుంజన్ శర్మ లు కొనుగోలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రవిబాబు తెలిపారు.

తాజావార్తలు