సర్పంచ్ చేసే అభివృద్ధి పనులను సూచివోరువలేక అసత్యపు ప్రచారాలు

మల్లాపూర్( జనం సాక్షి): సాతారం గ్రామ సర్పంచ్ పోతవేణి నారాయణ కిషన్ గౌడ్ పై కొందరు గిట్టని వ్యక్తులు ఓర్వలేక ఓ దినపత్రిక పేరుతో సర్పంచ్ పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని సాతారం గ్రామస్తులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందర సర్పంచ్ తో కలిసి గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత పంచాయతీ విషయాలను సరిదిద్దుకోకుండా సముదాయించిన సర్పంచ్ కిషన్ గౌడ్ పై కక్షపూరితంగా వార్తలు సృష్టిస్తూ అసత్యపు ప్రచారాలకు తెర లేపారని అందులో వాస్తవం లేదన్నారు,సర్కారు బడిలో వంట చేసే వృద్ధురాలి విషయంలో సర్పంచ్ జోక్యం లేదని, కొందరు పనిగట్టుకుని సర్పంచును బదనాం చేసే పని చేశారన్నారు. అసత్యపు వార్తలు ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేసేటట్లు సర్పంచ్ తెలిపారు . ఈ సమావేశంలో సర్పంచ్ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ జగన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీలు గుర్రాల శ్రీనివాస్, గున్నాల శ్రీనివాస్, హనుమంత్ రెడ్డి, గ్రామస్తులు తదితరులున్నారు.



