విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 8 (జనం సాక్షి)
మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన
వెంకటేష్ గౌడ్, వయస్సు 38సంవత్సరలు, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో బకాసుర హోటల్ ఎదురుగా తను నూతన గా నిర్మిస్తున్న ఇంటి వద్ద విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి చెందాడు,భవన్ పై ఉన్న విద్యుత్ తీగలు క్రిందకు ఉండటం తోనే ఈ ప్రమాదం జరిగింది అంటున్న స్థానికులు,విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అంటూ నాగార్జునసాగర్ హైవేపై ధర్నా చేపట్టిన బంధువులు గ్రామస్తులు



