గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలి
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రగ్రాద్ధతో పనిచేయాలి
నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు,పొరపాట్లు లేకుండా చూడాలి
వికారాబాద్ జిల్లా సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష
బొంరాస్ పేట(జనం సాక్షి): గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని వికారాబాద్ జిల్లా సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష అధికారులకు సూచించారు.మంగళవారం బొంరాస్ పేట్ మండలంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష,వ్యయ పరిశీలకులు మనోహర్ రాజులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధతో కలిసి నామినేషన్లకు సంబంధించిన కేంద్రాలను పరిశీలించారు.బొంరాస్ పేట రైతు వేదికలో బొంరాస్ పేట్, దుప్చర్ల,మహంతిపూర్,జానకంపల్లి గ్రామపంచాయతీలకు అదేవిధంగా తుంకిమెట్ల రైతు వేదికలో తుంకిమెట్ల,బొట్లవాని తండా,నాగిరెడ్డి పల్లి గ్రామపంచాతీలకు సంబంధించిన నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష మాట్లాడుతూ గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు,పొరపాట్లు లేకుండా చూడాలన్నారు.నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావలసిన ధృవ పత్రలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని ఆమె సూచించారు.నామినేషన్ల ఫారాలను స్పష్టంగా చూసి వాటిల్లో ఏవైనా తప్పులు వుంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు.వ్యయ పరిశీలకులు మనోహర్ రాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు.అభ్యర్థులు వ్యయం వివరాలు సమర్పించినట్లు అయితే గెలుపు రద్దు అవుతుందనే విషయాన్ని కూడా అభ్యర్థులకు స్పష్టంగా తెలియ చేయాలని ఆయన తెలిపారు.గ్రామపంచాయతీలో పోటీ చేసే అభ్యర్థలకు వ్యయాలకు సంబంధించి ప్రత్యేక బ్యాంకు ఖాత ఉండాలని ఆయన సూచించారు.సర్పంచ్,వార్డు మెంబర్లు నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు పెట్టాలనే విషయము అభ్యర్థులకు స్పష్టంగా తెలియ చేయాలని ఆయన అధికారులకు సూచించారు.నామినషన్ల కేంద్రాల పరిశీలనలో డీఎల్పీవో ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ పద్మావతి,ఎంపిడిఓ వెంకన్ గౌడ్, ఎంపివో రవి నాయక్,ఈసీ ఇలియాస్, పంచాయతి కార్యదర్శులు రాజేష్,వెంకటయ్య, రిటర్నింగ్,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.



