ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహణ

దండేపల్లి, ఆగస్టు 9 (జనంసాక్షి): దండేపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై మాట్లాడారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.