పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం లో వస్తున్న బియ్యంలో పురుగులు

*సివిల్ సప్లై అధికారులకు , ఎమ్మార్వో ఫిర్యాదు చేసిన సర్పంచ్ చేర్యాల రాజు , హెచ్ఎం సుశాంత్ కుమార్
నంగునూర్, జూలై 21 (జనం సాక్షి)నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల లో మధ్యాహ్నం భోజన పథకం కింద వస్తున్న బియ్యం లో పురుగులు వచ్చాయి .అని సమాచారం అందుకున్న సర్పంచ్ చేర్యాల రాజు వెంటనే సంబందించిన , సివిల్ సప్లై అధికారులకు, ఎమ్మార్వో కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన నంగునుర్ ఎమ్మార్వో , ఆర్ ఐ , పాఠశాల ను సందర్శించి సివిల్ సప్లై అధికారులుకు మాట్లాడంతో ఒక గంట వ్యవదిలో ఈ బియ్యం తీసుకొని వేరే బియ్యం ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఇలాంటి సమస్య రాకూడదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేర్యాల రాజు, హెచ్ఎం సుశాంత్ కుమార్ , ఉప సర్పంచ్ కలకుంట్ల యాదగిరి ,మాజీ సర్పంచ్ ఏల లత -కృష్ణ ఉప సర్పంచ్ కళకుంట్ల యాదగిరి మాజీ ఎంపిటిసి కళకుంట్ల నర్సిములు ,పిల్లి యాదగిరి ఆరుట్ల బల్ లింగం,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



