పెగడాపల్లిలో కుస్తీ పోటీలు

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో మల్లమ్మ జాతరను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. ఈ మేరకు డిల్లి నుండి వచ్చిన బల్జిత్ కౌర్ (27) పట్టిన కుస్తీ ప్రతీ ఒక్కరినీ ఆశ్చారానికి గురి చేసింది. మహిళా అయినప్పటికీ మగవారితో సమానంగా కుస్తీ పోటీలో పాల్గొని వారిని మట్టి కరిపించారు. మహిళా మళ్ళయోధురాలును చూసేందుకు జనాలు పెగడాపల్లి గ్రామం నుండితో పాటు దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు విజేత అయిన బల్జిత్ కౌర్ కు పది తులాల వెండి కడియాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పెగడాపల్లి గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ దొనకంటి లక్ష్మారెడ్డి, సహకార సంఘం చైర్మన్ దొనకంటి రాజారెడ్డి, విడిసి ఉపాధ్యక్షులు సంజీవ్, ప్రధాన కార్యదర్శి మంద నాగరాజు, కోశాధికారి అబ్బన్న, ఉప కార్యదర్శి గణేష్, గ్రామస్తులు పోతా రెడ్డి, మద్ది సుదర్శన్, మేడి రవి, సాయిలు, రామయ్య, కృష్ణ రెడ్డితో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.