అభివృద్ది చూసే ప్రజలు ఆకర్శితులవుతున్నారు

share on facebook

కెసిఆర్‌కు మద్దతుగా నిలవాలి: బండా
నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో గత ఐదేళ్లకాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు చూసి వాటిలో భాగస్వామ్యం కావాలనే అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి అన్నారు.  అల్లాటప్పాగా వచ్చి చేరడం లేదన్నారు. జనం చేరడంతో కాంగ్రెస్‌,టిడిపి నేతల్లో భయం పట్టుకుందన్నారు. జనం మెచ్చిన పాలన చూసి వివిధ పార్టీలు, కుల సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో వారికి లబ్ధి చేకూరిందని వివరించారు. ప్రజామోదం పొందిన కేసీఆర్‌ పాలనను చూసి నియోజకవర్గంలో అనేక మంది కుల సంఘాల, వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడం శుభ సూచకమన్నారు. వారంతా ఇంటి పార్టీ అని భావించి చేరుతున్నారని వివరించారు.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి కేసీఆర్‌ అన్ని వర్గాలను ఆర్థికపథంలో నడిపించాలన్న ఉద్ధేశంతో సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ అమలు  చేస్తున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పక్క రాష్టాల్రు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరిగి సంక్షేమ ఫలాలు దక్కాలంటే అందరూ టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవాలని  కోరారు.

Other News

Comments are closed.