అల్లుడి చేతిలో మామ హతం

share on facebook
దంతాలపల్లి ఆగస్టు 17 జనం సాక్ష
అల్లుడి చేతిలో మామ హతమైన సంఘటన మండలంలోని బొడ్లాడ గ్రామంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జనిగల వెంకన్న తన చిన్న కూతురు స్వరూపను అదే గ్రామానికి చెందిన ఊడుగుల నవీన్ కు ఇచ్చి సుమారు మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశాడు. అనంతరం తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు చేసి భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేసి కాపురానికి పంపించే వారు.ఇటీవల గ్రామంలో జరిగిన ముత్యాలమ్మ  పండగ సందర్భంగా తల్లిగారిల్లు అయిన వెంకన్న ఇంటికి వెళ్లి వారం రోజులైనా స్వరూప  ఇంటికి రాకపోవడంతో కోపోద్రిక్తుడైన నవీన్ బుధవారం వెంకన్న ఇంటికి వెళ్లి తన భార్య స్వరూపను కోపంగా తీసుకు రావడంతో తన కూతుర్ని ఏమన్నా అంటున్నాడో అనే భయంతో మామ ఆయిన వెంకన్న నవీన్ ఇంటికి రావడంతో  మామ పై దాడి చేసి విశిక్షణ రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన వెంకన్నను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కే జగదీష్ గ్రామంలో విచారణ చేపట్టిన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

Other News

Comments are closed.