ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి 

share on facebook

కడప,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన  డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగసంఘం నేతలు  అన్నారు.  ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో కాలయాపన చేయడం దారుణమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యు లర్‌ చేయాలని, పెరిగిన జీతాలను వెంటనే ఇవ్వాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని, హెల్త్‌ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికి అవి చాలా ఆసుపత్రులలో ఉద్యోగులకు సేవలు అందడం లేదని పేర్కొన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానం పూర్తిగా రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. చాలా శాఖల్లో అధికారులు వారి ఇష్టా రాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యో గులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆయా శాఖలకు సంబందించిన సంఘాల నాయకులతో మాట్లాడి నిర్ణయాలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం పెన్షనర్లు 75 సంవత్సరాలు దాటిన వారికి 15 శాతం ఇస్తున్నారని అలాకాకుండా 70 సంవత్సరాలు వయస్సు ఉన్న వారికే 15 శాతం ఇచ్చేలా చర్యలు తీసు కొనేందుకు కృషి చేస్తామన్నారు.

Other News

Comments are closed.