కారణం లేనిది మరణం ఒక్క యాక్సిడెంట్ మాత్రమే

share on facebook
– ఒక యాక్సిడెంట్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.
 – అనుభవించిన కుటుంబాలను చూస్తే వారి యొక్క బాధ తెలుస్తుంది.
 – రోడ్డు ప్రమాదాల గురించి అప్రమత్తంగా ఉండి ప్రాణాలు కాపాడుకుందాం.
 – అతివేగం, అజాగ్రత్తగా, నిద్రలేమితో, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల చాలా ప్రమాదాలు.
– అర్దం చేసుకుందాం బాద్యతగా వ్యవహరిద్దాం
 – కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది.
 – రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి సేఫ్ గా ఇళ్లల్లోకి చేరుకోండి.
 పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్.
సిద్దిపేట బ్యూరో 21, జూన్ ( జనం సాక్షి )
గత ఆరు నెలల నుండి జరిగిన రోడ్డు ప్రమాదాల విషయంలో పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత మాట్లాడుతూ యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం రోడ్డున పడటం  అన్నారు.  అలాగే రహదారుపై తెలుపు గీతలు పసుపు లైన్లు సంజ్ఞలు సంకేతాలు రోడ్డుపై మనకు రకరకాల రేఖలు కనిపిస్తుంటాయి.చాలామందికి వీటి అర్థం తెలియదు.. కొందరైతే అసలు పట్టించుకోరు. కానీ ఈ ప్రతి గీతకో పరమార్థం ఉందనే సంగతి మీకు తెలుసా? ఆ అర్థం అవగతం చేసుకుంటే ప్రమాదాలు జరగకుండా మన తలరాతను మార్చే శక్తి వీటికుందిని  వాటి గురించి వివరిస్తూ తెలుపు: అన్నీ రకాల సంకేతాలకు తెలుపు రంగు వాడతారు.పసుపు రంగు: అవరోదాలు ఉన్నాయి అనడానికి సంకేతం నలుపు: తెలుపునకు ప్రత్యామ్నాయం.పాదాచారుల కాళి బాటకు ఎక్కువగా వాడతారు .
• బ్రోకెన్‌ తెలుపు గీతలు
దేశంలో అత్యధికంగా కనిపించే రోడ్డు మార్కింగ్‌. దీనర్థం వాహనదారుడు రోడ్డు మీద వెళ్తుంటే కావాలనుకున్నప్పుడు వరుసలు మారొచ్ఛు ముందున్న వాహనాలను ఓవర్‌టేక్‌ చేయొచ్ఛు యూటర్న్‌ తీసుకోవచ్చు అని అర్థం. అయితే ఇవన్నీ చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెనకాముందు చూడాలి అనిఈ గీత చెబుతుంది.
• ఏకధాటి (సాలిడ్‌) తెలుపు గీతలు.
 ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయొద్ధు యూటర్న్‌ తీసుకోవద్దు అని ఈ రేఖ చెబుతుంది. అంటే ముందు ప్రమాదకర పరిస్థితులున్నాయి.. వెలుతురు సరిగా లేదు. అని. అయినా ఈ రోడ్డు నుంచి బయటికి వెళ్లాలి,
• రెండు వరుసల పసుపు గీతలు దీనర్థం.
ఎట్టి పరిస్థితుల్లోనూ వరుస మారొద్ధు ముందు వాహనాల్ని దాటొద్ధు ఏదైనా అతిపెద్ద అడ్డంకి ఉంటే తప్ప కూడలిలో సిగ్నళ్లు పడినప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి. వెడల్పు తక్కువగా ఉండే రెండు వరుసల రహదారికి మాత్రమే ఇలాంటి గీతలు వాడతారు.
పసుపు గీత పక్కన బ్రోకెన్‌ పసుపు రేఖ ఇందులో రెండు అర్థాలున్నాయి. బ్రోకెన్‌ లైన్‌ వైపు మనం ఉంటే ముందు వెళ్తున్న వాహనాన్ని దాటుకొని వెళ్లవచ్ఛు సాలిడ్‌ పసుపురంగు గీత వైపు డ్రైవింగ్‌లో ఉంటే ఓవర్‌టేక్‌ చేయడానికి వీల్లేదు. స్టాప్‌ లైన్‌: ఆ గీత కన్నా ముందే ఆగిపోవాలి. వాహనాన్ని ముందు ఆపాలి.
– గివ్‌ అవే లైన్‌: తిరగేసిన త్రిభుజాకారపు గుర్తు. రెండు వరుసల చుక్కల లైన్లు జంక్షన్ల దగ్గర కనిపిస్తాయి. మనం నడిపే వాహనం ప్రధాన రహదారిపైకి వస్తున్నప్పుడు అటూఇటూ చూసుకొని వాహనాలకు, ట్రాఫిక్‌కి అడ్డుపడకుండా వెళ్లాలి.
బోర్డర్‌ ఎడ్జ్‌ లైన్స్‌: రహదారి ముగిసేవరకూ ఇవి ఉంటాయి. సాధారణంగా తెలుపు రంగులో వేస్తారు. వాహనాలు ఈ గీతను దాటి బయటికి వెళ్లడం ప్రమాదకరం అని చెప్పడమే దాని ఉద్దేశం. ఒకవేళ వాహనాన్ని పార్క్‌ చేయాల్సి వస్తే ఈ గీతకి బయటే నిలపాలి.
– ఎల్లో బాక్స్‌ జంక్షన్‌: రోడ్డు మధ్యలో ఇంటర్‌ సెక్షన్‌లో వేస్తారు. దీనిపై నుంచి ఇరుపక్కల ద్వారా వాహనాలు వెళ్లొచ్ఛు ఇతర అడ్డంకులేమీ లేనప్పుడు, వేరే వాహనాలు బాక్స్‌ గుండా వెళ్లనప్పుడు మాత్రమే ఈ బాక్స్‌ ద్వారా మలుపు తీసుకోవచ్ఛు.
– పెడెస్ట్రియిన్‌ క్రాసింగ్‌: వీటినే జీబ్రా క్రాసింగ్‌ అంటుంటారు. నలుపు, తెలుపుల స్ట్రిప్‌లతో గుర్తులు వేస్తారు. సాధారణంగా కూడళ్లలో ఈ గుర్తులుంటాయి. సిగ్నల్‌ పడ్డప్పుడు పాదచారులు తప్పకుండా వీటి ద్వారానే రోడ్డు దాటాలి. ఆ సమయంలో చోదకులు వాహనాలను ఆపేయాలి.
• రంబుల్‌ స్ట్రిప్‌లు.
పట్టీల్లా రోడ్డుపై కొంచెం ఉబ్బెత్తుగా వేసే గీతలివి. వాహనాలు వీటిపై నుంచి వెళ్తుంటే చిన్నపాటి శబ్దం వస్తుంది. నిద్రమత్తులో, పరాకుగా ఉన్న డ్రైవర్లను అప్రమత్తం చేయడానికే ఈ ఏర్పాటు. నిబంధనలు పాటిస్తే, రోడ్డు గీతలపై అవగాహన ఉంటే ప్రయాణం భద్రంగా ఉంటుంది. ప్రమాదాలు తగ్గడానికి ఆస్కారం. ఎక్కడ ఆపాలో, ఎక్కడ పార్కింగ్‌ చేయాలో, ఎక్కడ యూటర్న్‌ తీసుకోవాలో చిన్న చిన్న సమాచారం సైతం తేలిగ్గా తెలుస్తుంది. ఇరుకు రోడ్లు, వంతెనలు, మలుపులు.. ఇలాంటి అడ్డంకులను సైతం తెలియజేస్తూ ప్రమాదాలను నివారిస్తాయి. కాబట్టి ప్రతి వాహనదారుడు రంగుల గీతాలను వాటి సంకేతాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా తమ వాహనాలను నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.రోడ్డు ప్రమాదాల నిర్వహణ గురించి తీసుకుంటున్న చర్యలు ప్రజలు వాహనదారులు సహకరించి మరియు నిబంధనలు పాటించనిచొ రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చని కమిషనర్ శ్వేత సూచించారు.

Other News

Comments are closed.