గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

share on facebook

– ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణ తదితరల అంశాలపై గవర్నర్‌కు వివరించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌,నవంబర్‌ 26(జనంసాక్షి):గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సుమారు రెండున్నర గంటలపాటు ఆమెతో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం సహా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు.. 5100 ప్రైవేట్‌ రూట్లకు రవాణా అనుమతుల విషయాన్ని గవర్నర్‌ దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా కేసీఆర్‌ గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. రెవెన్యూశాఖలో ప్రక్షాళన కోసం కొత్త రెవెన్యూ చట్టం సహా ఇతర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది

 

Other News

Comments are closed.