టిఆర్‌ఎస్ బైక్ ర్యాలీ
మెదక్,అక్టోబర్10(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలం దౌల్తాబాద్‌లో టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టిఆర్‌ఎస్ లో చేరారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ నేతలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగర్‌కర్నూల్ మండలం నెల్లికొండకు చెందిన దాదాపు 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎంఎల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.