టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ….

share on facebook

 

సికింద్రాబాద్ (జనం సాక్షి ):
గత 13 సంవత్సరాల నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ ఆవరణలో టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా శుక్రవారం మంత్రి మల్లారెడ్డి,బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ విచ్చేసి దేవి దుర్గామాత ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..అలనాడు పాండవులు కౌరవులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆయుధ పూజ చేసి బయలుదేరి విజయం సాధించారని, అదే విధంగా మా ముఖ్యమంత్రి కె సి ఆర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని దసరా రోజు జాతీయ రాజకేయ పార్టీ పెట్టి విజయ దుందిభి మోగిస్తారని, ఎవ్వరు ఆపలేరని మంత్రి మల్లన్న ఎప్పటి లాగే తన మార్కు చూపించారు..శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరారు..అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి..ఈ కార్యక్రమంలో బొడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, టి.ఎన్. శ్రీనివాస్, వినోద్,ప్రభు గుప్త, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.