తానా మాజీ అద్యక్షులు తాళ్లూరి జయ శేఖర్ కు ఘన

share on facebook

తానా మాజీ అద్యక్షులు తాళ్లూరి జయ శేఖర్ కు ఘన స్వాగతం. తానా మాజీ అద్యక్షులు తాళ్లూరి జయ శేఖర్ కు ఘన స్వాగతం.
– స్వాగతం పలికిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులు.
– అభివృద్ధిలో తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపిన తాళ్లూరి.
బూర్గంపహాడ్ డిసెంబర్ 02 (జనంసాక్షి)ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు ఎన్నారై ప్రతినిధి తాళ్లూరి జయ శేఖర్ కు ఘన స్వాగతం పలికిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులు. స్థానిక మండలం లక్ష్మీపురంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులను శుక్రవారం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు ఎన్నారై ప్రతినిధి తాళ్లూరి జయ శేఖర్ స్వగృహానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి మండలంలోని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సహాయ సహకారాలు అందించాలని వారిని పలువురు ప్రజా ప్రతినిధులు సూచించారు. అభివృద్ధిలో తను ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటానని తన సహాయ సహకారాలు ఉంటాయని తను కూడా భాగస్వామి అవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, పార్టీ నాయకులు పోతిరెడ్డి గోవింద్ రెడ్డి, బిట్రు సాయిబాబు, చుక్కపల్లి బాలాజీ, లక్ష్మీపురం వార్డు సభ్యులు పాలం దివాకర్ రెడ్డి, తాళ్లూరి శ్రీహరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.