పశువుల దానాను పంపిణీ చేసిన జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న.

share on facebook

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి రామిరెడ్డి శ్రీలత, సర్పంచ్ సిరిపురపు స్వప్న కేంద్రం ప్రాథమిక పశువైద్యశాల ప్రాంగణంలో
ఉచిత పసువుల దాన పంపిణీ చేశారు.
మండల కేంద్రం లోని ఓ ప్రాంతీయ పశు వైద్యశాల ప్రాంగణంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ రవీందర్, డాక్టర్ ఠాగూర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నిధులనుండి గోదావరి పవిత్ర ప్రాంతంలో పశు పోషణలకు ఉచిత పశువు దాన స్థానిక జడ్పిటిసి శ్రీలత, సర్పంచ్ సిరిపురపు స్వప్న లు దానాని రైతులకు పంపిణీ చేశారు.18న సారపాక గ్రామపంచాయతీ వారికి, 22న నాగినేని పోలు రెడ్డిపాలెం రైతులకు పశువు దాన పంపిణీ నిర్వహించినట్లు తెలిపారు. రైతులు వారికి సంబంధించిన పశువుల సంఖ్య ఆధారంగా దాన పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. గోదావరి ప్రభావిత ప్రాంతాలలో గల రైతు లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.