పోలవరంపై టిడిపి నేతల ట్రోల్‌ డ్రామాలు

share on facebook

2018లోనే నీటిని విడుదల చేస్తామని బుకాయించారు

మండిపడ్డ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు,డిసెంబర్‌2( జనం సాక్షి ): టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు ట్రోల్‌ చెయ్యరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యం అయ్యిందో విూకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయా ఫ్రమ్‌ వాల్‌, కాంక్రీట్‌ వాల్‌ నాణ్యత లోపం వాస్తవం కాదా అని నిలదీశారు. పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్‌ చేయడం లేదని,  అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్‌ చేయాలని సవాల్‌ విసిరారు. టీడీపీ చెంచా విూడియా అసత్య కథనాలు జనం నమ్మరని స్పష్టం చేశారు. కుల గజ్జితో పసుపు విూడియా తప్పుడు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. j

Other News

Comments are closed.