ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇన్సూరెన్స్ పథకాన్ని వినియోగించుకోవాలి
హుజూర్ నగర్ 25 మే (జనంసాక్షి): ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇన్సూరెన్స్ పథకాన్ని వినియోగించుకోవాలని నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. గురువారం ట్రాక్టర్ మెకానిక్ సమ్మేళనం హుజూర్ నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, కేతవారిగూడెంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నియోజవర్గ కార్మిక సంఘ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మెకానిక్ కులంతా ఐక్యంగా ఉండాలి. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ భవన నిర్మాణంలో భాగంగా 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. నేరేడుచర్ల మెకానికులకు ఆటోనగర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు 11 ఎకరాలు కేటాయించి పనులు సాగుతున్నాయి అన్నారు. మున్సిపాలిటీలో కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని ఎమ్మెల్యే ని కోరడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా మీకందరికీ అందే విధంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి చేపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జానకి రామయ్య, గుడిపాటి అనిల్ కుమార్, నరసింహారావు, రాము, నరసింహారావు ,వెంకన్న, శ్రీను జానయ్య, కాశయ్య, రాంబాబు, కృష్ణ ముఖ్యులు పాల్గొన్నారు.