ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య: డిఇవో

share on facebook

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం కన్నా విద్యార్థులు ప్రవేశాల సంఖ్య పెరిగిందన్నారు. పదో తరగతి ఫలితాల శాతం పెరిగిందన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదన్నారు. పాఠశాలకు విరాళం అందజేసి గ్రామాల్లో ప్రభుత్వ విద్య పటిష్టతకు తోడ్పాటు ఇవ్వాలన్నారు.   ఏఎంఎస్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ గ్రాహం కూని మాట్లాడుతూ.. సంస్థ విద్యాపరంగా సహాయం చేయాడానికి ముందుంటుందని తెలిపారు. ఏఎంఎస్‌ సంస్థ తెలంగాణ ప్రతినిధి అలేఖ్య మాట్లాడుతూ.. పాఠశాలలో పదో తరగతిలో 9 జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.ఐదు వేల నగదు పురస్కారం అందజేస్తామని వెల్లడించారు.  వందశాతం హాజరు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు.  గుడిహత్నూర్‌ మండలంలోని మన్నూర్‌ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఏఎంఎస్‌ సంస్థ, ఏకలవ్య ఫౌండేషన్‌ సంయుక్తంగా పాఠశాలకు 100 బెంచీలు, స్కూల్‌ బ్యాగ్‌లు విరాళంగా అందజేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Other News

Comments are closed.