*బిజెపి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు*

share on facebook

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 26 :
జనం సాక్షి
చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ని పాత బస్ స్టాండ్ వద్ద గల విగ్రహానికి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీరనారి , తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సామాన్య కుటుంబంలో జన్మించి ఆమె పోరాట జీవితమంతా పీడిత ప్రజల కోసం ఉపయోగపడి, పనిచేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ , మాజీ జెడ్పిటిసి , బిజెపి నియోజకవర్గ నాయకురాలు జె.యన్ సునీత వెంకట్ , బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ , బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్ , రజక సంఘ సభ్యులు కల్లూరి సురేష్ పుల్లురి తిలక్,వన్నెల సాయిలు, వడ్నల లక్ష్మణ్, వన్నెల శశికుమార్, రజక సంఘ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Other News

Comments are closed.