మావోయిస్టుల సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం

share on facebook

– జీవో విడుదల చేసిన ఏపీ సర్కారు

అమరావతి, జులై 15(జనంసాక్షి):రాష్ట్రంలో మావోయిస్టులు సమస్యలపై వైసీపీ ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అధ్యక్షతన ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. నక్సల్స్‌ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనపై ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ¬ం మంత్రి సహా రెవెన్యూ, గిరిజన సంక్షేమం, రహదారులు, భవనాల శాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. లొంగిపోయిన నక్సల్స్‌ పునరావాసం, తీవ్రవాదం కారణంగా మరణించిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపు, ధ్వంసమైన ఆస్తులకు పరిహారం, విధానాల రూపకల్పన తదితర అంశాలను ఈ మంత్రివర్గ ఉపసంఘం సవిూక్షించనుంది. సిఫార్సులకు, నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అమలు చేస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Other News

Comments are closed.