లెక్క తప్పింది

share on facebook

 

 

 

కోర్టును తప్పుదోవ పట్టించేందుకు తెలివి ప్రదర్శిస్తున్నారు

మూడు శాఖల అధికారులు ఒక్కో పాట పాడుతున్నారు

అధికారులను తీవ్రస్థాయిలో మందలించిన హైకోర్టు

తదుపరి విచారణ 11కు వాయిదా వేసిన హైకోర్టు

ఆలోపు సమస్యలపై ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 7(జనంసాక్షి): తన 15ఏళ్లు సర్వీస్సులో అధికారులు ఇలాంటి తప్పుడు నివేదికలు ఇవ్వటా న్ని నేనెప్పుడూ చూడలేదనంటూ తెలంగాణ అధికారులపై హైకోర్టు తీవ్రసా యిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టులో గురువా రం విచారణ జరిగింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ… చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని.. తాము వేటిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృ ష్ణారావు వివరణనిస్తూ.. 2-6-2014 నుంచి అక్టోబర్ 2019 వరకు ఉన్న మొత్తం లెక్కలను మీకు అందించిన మిగతా 2లో.. 00000+ పాలు చేశారు. అసలు నేను పలువురు రు రు రు అనం తరం – ఆలోపు సమస్యలపై ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశం తాజా నివేదికలో పొందుపరిచామన్నారు. కాగ్ నివేదిక అనుగుణంగా తయారు చేసిన పూర్తి వివరాలతో మీకు అందించామని హైకోర్టుకు తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని హైకోర్టు పేర్కొంది. అధికారుల నివేదికపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని హైకోర్టు ఇంతవరకు ఏ బడ్జెట్ లో అలా చూడలేదని పేర్కొంది. అయితే సీజే అడిగిన ప్రతి ప్రశ్నకి నివేదిక ఆధారంగా రామకృష్ణారావు లెక్కలు చూపిస్తూ సమాధానం చెబుతున్నారు. మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని… ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. కేబినెట్ కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని, సీఎంకి సైతం తప్పుడు లెక్కలతో స్టేట్మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హైకోర్టు మండిపడింది. మూడు రాష్ట్రాల్లో పనిచేశా.. ఇలా ఎవరూ అబద్దాలు చెప్పలేదు.. ఐదేళ్లలో జడ్జి చరిత్రలో ఇంతగా అబద్దాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని సునీల్ శర్మపై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ విరుచుకుపడ్డారు. తాను మూడు రాష్ట్రాల్లో పనిచేశానని, హైకోర్టుకు ఇలా ఎవరూ అబద్దాలు చెప్పలేదన్నారు. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు జీహెచ్ఎంసీని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఇవ్వాల్సి ఉందని మంత్రికి చెప్పడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని, హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్య చేయాలని తాము ప్రయత్నిస్తున్నామని.. కానీ ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని హైకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఐదు నిమిషాలు తన స్థానంలో ఉండి చూడాలని, ఈ నివేదేకలు, వారు చెప్పే మాటలు నమ్మే విధంగా ఉన్నాయా అంటూ అధికారులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చి మళ్ళీ విధులకు హాజరు కావాలని చెప్పినా కనీసం 300మంది కూడా చేరలేదని, కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. మీరు రవాణా శాఖ మంత్రితో సైతం అసెంబ్లీ వేదికగా తప్పుడు గణాంకాలు వేయించారని సునీల్ శర్మపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ అసెంబ్లీ ఇన్ఫర్మేషన్ సరైంది అయితే హైకోర్టులో వారు దాఖలు చేసిన అఫిడవిట్ తప్పవుతుంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఆర్టీసీ విభజన పూర్తికాలేదు – కేంద్రం కేంద్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని తెలిపారు. ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని కేంద్రం తరపు లాయర్ పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీకి ఆటోమేటిక్ గా బదిలీ కాదని కేంద్ర పరిన్న రికార్డుల కోరడం సమాధానంను 11కు వాలువాలని, సాధ్యమేలకు హైకోర్టు ప్రభుత్వం వాదన వినిపించింది. ఆర్టీసీ రీఆర్గనైజేషన్ కు తమ అనుమతి కోరలేదని కేంద్రం పేర్కొంది. ఆర్టీసీ.. షెడ్యూల్ 9 కిందకు వస్తుందని సీఎస్ హైకోర్టుకు తెలిపారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేశామని సీఎస్, ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఎండీ పేర్కొన్నారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్ద పెండింగులో ఉందని ఏజీ తెలిపారు. ఆర్టీసీ విభజన పెండింగ్ లో ఉందంటూనే కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామని ఎలా చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం ఆమోదం లేకుండా.. రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు నిలదీసింది. ఏపీఎస్ఆర్టీసీ విభజనకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలకు అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీని ఏర్పాటు చేశామని రామకృష్ణారావు తెలిపారు. కేంద్రం అనుమతి పెండింగ్ లో ఉండగా కొత్త స్వతంత్ర సంస్థ ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ విభజన జరగకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ ఇస్తుందని అధికారులను హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వం, కార్మికసంఘాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం 47కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. ఇరిగేషన్ కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొంది. రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అంతకు ముందు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం తప్పుపట్టింది. ఐఏఎస్ అధికారులే హైకోర్టుకు ఇలా నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలియదా అని హైకోర్టు ప్రశ్నించింది. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించే నివేదిక ఇస్తున్నామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. అలాగైతే మొదటి నివేదిక పరిశీలించాకుండానే ఇచ్చారా అని ధర్మాసనం నిలదీసింది. తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని తమను క్షమించాలని రామకృష్ణారావు కోరారు. క్షమాపణ కోరడం సమాధానం కాదని కోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టులకు వాస్తవాలు చెప్పాలని హెచ్చరించింది. కాగా విచారణను 11కు వాయిదావేస్తూ హైకోర్టు పేర్కొంది. ఈలోపు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చర్చలకు పిలవాలని, సాధ్యమైనంత మేరకు సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలంటూ అధికారులకు హైకోర్టు సూచించింది.

Other News

Comments are closed.