వందశాతం మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి

share on facebook

టిడిపి గెలుపు ఖాయమై పోయింది: జివి
గుంటూరు,మే4(జ‌నంసాక్షి): తమ నేత చంద్రబాబును మళ్లీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రజలు ఓట్లు వేశారని  గుంటూరు టిడిపి అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు.  చంద్రబాబు బ్రహ్మాండమైన స్వీప్‌తో గెలవబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు చంద్రబాబు అద్భుత పాలన సాగించారని అన్నారు. అమరావతి ఎక్కడ గుజరాత్‌ను మించి పోతుందోనని మోదీ ఏపీకి నిధులివ్వకుండా, ¬దా ఇస్తామని హావిూ ఇచ్చి అదీ ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశాడని విమర్శించారు. అయినా మొక్కవోని విశ్వాసంతో చంద్రబాబు ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఇది ఓర్వలేని పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్‌, ప్రతిపక్ష నేత జగన్‌లు కలిసి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో వీరి కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని,అది 23న తేటతెల్లమవుతుందని జోస్యం చెప్పారు.
ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమై పోయిందని, అందుకే ఇసిని అడ్డం పెట్టుకుని డ్రామాలకు తెరలేపారని అన్నారు. తెదేపాకు సానుకూల పరిస్థితులు వున్నాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. కేంద్ర సహకారం లేకపోయినా పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం చేపట్టారని, పరిశ్రమలు సైతం తీసుకొచ్చారని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటే మరుసటి రోజు తెల్లవారి 5గంటల వరకు ఓటర్లెవరూ క్యూలైన్లలో వేచి ఉండరని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో విశ్వాసం ఉందని, డ్వాక్రా మహిళలు బాబు పనితీరుకు ఓటేశారని అన్నారు.

Other News

Comments are closed.