విభజన హావిూలను తుంగలో తొక్కారు

share on facebook

సీమ ప్రజల ఆకాంక్షలను పక్కకునెట్టారు : గఫూర్‌
కర్నూలు,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా బదులు ప్యాకేజీ అంటూ కేంద్రం తాయిలాలు ఇచ్చిందని చెప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క ప్రయోజనమైనా కలిగిందా అన్నది చెప్పాలని సిఐటియూ నాయకుడు గఫూర్‌ అన్నారు. ఇది ప్రజలను నిలువునా ముంచడమేనని అన్నారు. విభజనతో కాంగ్రెస్‌ మోసం చేస్తే,¬దాను పక్కన పెట్టి ప్యాకేజీతో కేంద్రం మోసం చేసిందన్నారు. దీనికి చంద్రబాబు తలూపడం ద్వారా గత ఐదేళ్లుగా ఎలాంటి ముందడుగు వేయలేదన్నారు. యూపీఎ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌  ఐదేళ్ల ¬దాకు హావిూ ఇచ్చారని పదిహేనేళ్లు అడిగిన బిజెపి ఇప్పుడు మొత్తానికే గుండుసున్నా చుట్టారని మండిపడడ్డారు. సీమ సమస్యలపై చిత్తశుద్ది లేదని, నిరుద్యోగ సమస్యలపై శ్రద్ద లేదని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హావిూని అమలు చేయకుండా నమ్మకద్రోహం చేశారని గఫూర్‌ అన్నారు. దీంతో రాయలసీమకు బాగా మోసం కాగలదన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ప్రత్యేక ¬దాను నిరాకరించారని దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారని సిసిఎం నేత హెచ్చరించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దీనిపై పోరాడాలన్నారు. కేంద్రం తొలి నుండీ చెబుతున్నదే తప్ప కొత్తగా చెప్పిందేవిూ లేదని అన్నారు. రాష్టాన్రికి  రావాల్సిన నిధులకు మంగళం పాడారని, రూ.1.50 లక్షల కోట్లు ఇస్తున్నామని చెబుతూ రావాల్సిన వాటికి మొండిచేయి చూపించారని తెలిపారు. రైల్వేజోన్‌ విషయాన్ని రైల్వేశాఖకు, కడప ఉక్కుఫ్యాకర్టీ వ్యవహారాన్ని ఆ శాఖకు అప్పగించామని తెలిపారే తప్ప స్పష్టమైన నిర్ణయం చెప్పలేదన్నారు. విద్యా,వైద్య రంగాలకు రూ.5000 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా నీరుగార్చారని పేర్కొన్నారు. మొత్తంగా ఏ ఒక్క విభజన హావిూని నెరవేర్చలేదని తెలిపారు.  ఎపీకి ప్రత్యేక ¬దాతోపాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందే అని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని పోరాడాలని అన్నారు. పునర్‌ విభజన చట్టంలో అన్ని అంశాలను పొందుపర్చినా గడిచిన మూడు సంవత్సరాల్లో వాటిని అమలు చేయించలేకపోవటం టీడీపీ అసమర్థతే కారణమన్నారు.

Other News

Comments are closed.