చంద్రానిపల్లిలో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన
రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై నాటికలు, పాటలతో ప్రచారం

ఇందల్వాయి, జూలై 13 (జనం సాక్షి):నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇందల్వాయి మండలం చంద్రానిపల్లి గ్రామంలో నిజామాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో చక్కని నాటిక, పాటలతో మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యతను వివరించారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలిపారు. హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని, జీవించు జీవించనివ్వు అంటూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఆటో డ్రైవర్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, అతివేగంగా, రాంగ్ రూట్‌లో, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని, ఒకవేళ మోసపోతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా మెలగాలని, పండుగలన్నీ స్నేహపూర్వకంగా జరుపుకోవాలని, ఆపద సమయంలో డయల్ 100ను ఉపయోగించుకోవాలని పోలీసులు తెలిపారు.

తాజావార్తలు