విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎమినెన్స్ అవార్డు

భూదాన్ పోచంపల్లి, జూలై 16 (జనం సాక్షి): దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఎమినెన్స్ అవార్డు (2025–26) లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్–2026లో ఈ అవార్డుతో పాటు అధికారిక ధృవీకరణ పత్రాన్ని యూనివర్సిటీ ప్రతినిధులకు అందజేశారు. అలాగే, ఆగస్టు 2026 నుంచి జూలై 2027 వరకు కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే అధికారిక ప్రిపరేషన్ సెంటర్గా విజ్ఞాన్స్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌కు గుర్తింపు లభించింది. ఈ ఘనత పట్ల యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.



