సిరిచెల్మ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

*156 బైక్స్, 2 ఆటోలు, 8 కార్లు, బొలెరో వాహనాలు స్వాధీనం.*

*1 క్వింటాల్ గుల్ఫారం (అమ్మోనియం బై కార్బోనేట్), 2 వందలకు పైగా లిక్కర్ బాటిల్స్ స్వాధీనం, 2 కేసులు నమోదు.*

*ఆసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవు.*

*ప్రజల సంరక్షణ, భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ ల నిర్వహణ*

*అసంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే 8712659973 కి వాట్సప్ ద్వారా తెలియజేయాలి.*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.*

బజార్హత్నూర్ /ఇచ్చోడ ( జనం సాక్షి):- ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామం నందు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు 120 మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరైన ధ్రువ పత్రాలు లేనటువంటి 156 ద్విచక్ర వాహనాలు, 2 ఆటో లను, 8 కార్లు, బొలెరో లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నెంబర్ ప్లేట్ లేని 3 వాహనాలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్రమంగా కల్తీ కళ్ళు తయారు చేయడానికి ఉపయోగపడే ముడి సరుకు అమ్మోనియం బైకార్బొనేట్ ఒక క్వింటల్ వరకు స్వాధీనం చేసుకొని నిందితుడు సురేందర్ గౌడ్ పై కేసు నమోదు చేస్తున్నట్లు , అదేవిధంగా అక్రమ మద్యం అనుమతులు లేకుండా విక్రయిస్తున్న పి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వద్ద దాదాపు 200 బాటిల్ల మద్యం లభించినట్లు అతనిపై ఇచ్చిన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సక్రమంగా జీవించాలని తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు, దోపిడీలు చేయకుండా, సత్ప్రవర్తనతో మెదలాలను తెలిపారు. గొడవలకు దారి తీసేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడిసి అక్రమాలు, బలవంతపు వసూళ్లు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం, దొంగ వాహనాలను కొనుగోలు చేయడం లాంటివి చేయవద్దని తెలిపారు. ఇదివరకే కేసులలో నమోదైన వారిపై సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగిందని, మిగిలిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ ప్రజలు నేరాలు చేసే వారి సమాచారం 8712659973 నెంబర్ కు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. విద్యార్థులకు చిన్నప్పటినుండి చదువుపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యం పై దృష్టి సారించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండాలని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సక్రమంగా వాహనాలను నడుపుతూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఎన్ వెంకట నరసయ్య, ఎ ఆర్ డిఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి,టి మురళి, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు