శ్రీ కట్ట మైసమ్మ ఆలయ చెత్తు నిర్మాణానికి ఐదు లక్షల ఒక వెయ్యి 14 రూపాయలు విరాళం.

share on facebook
తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు ఆగస్టు 12 (జనంసాక్షి) తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాత కుంట లో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయం నిర్మాణానికి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్
5 లక్షల ఒక్క వెయ్యి 14 రూపాయలు విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి పురష్కరించుకోని ఉదయం 6గంటల కు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శ్రీ కట్ట మైసమ్మ ఆలయం పునర్నిర్మాణానికి పూజారి సిద్ధి లింగయ్య స్వామి తో కలిసి వేద మంత్రోచ్ఛా రణల తో  భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్  మాట్లాడుతూ  శ్రీ కట్ట మైసమ్మ ఆలయం ముందు భాగాన చెత్తు కోసం తన వంతుగా ఐదు లక్షల ఒక వెయ్యి 14 రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. కట్ట మైసమ్మ తల్లి అత్యంత మహిమాన్విత మైన అమ్మవారిని తెలిపారు. కోరిన కోరికలు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లు తున్న కట్ట మైసమ్మ తల్లి అన్నారు. భక్తుల పాలిట కల్పతరువుగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుధాకర్ ,రాములు, రాజేష్, నర్సింలు, కృష్ణ, రమేష్, వేణుగోపాల్, పూజారి రాములు తదితరులు ఉన్నారు.

Other News

Comments are closed.