సిఎల్‌పి విలీనంపై ఓయూలో నిరసనలు
సమస్యలను పక్కన పెట్టి విలీనాలా?
హైదరాబాద్,జూన్7(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఓయూ విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. అక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిరుద్యోగ ఫ్రంట్ చైర్మెన్ చనగాని దయాకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా కుట్రలు పన్నుతోందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సమస్యలను,నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టి కేవలం పార్టీలను వలీనం చేసుకున్నపనిలో పడిందని విమర్శించారు. తెలంగాణలో అనేకానేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోక పోవడం దారుణమని అన్నారు.