సిద్దిపేట జిల్లాలో దారుణం

share on facebook

ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన కిరాతక తండ్రి

సిద్దిపేట,నవంబర్‌7(జ‌నంసాక్షి): దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమార్తెల పట్ల ఘోరంగా ప్రవర్తించాడు. ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. దీన్ని గమనించిన స్థానికులు.. ఆ ఇద్దరమ్మాయిలను హుటాహటిన సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిలిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆడపిల్లలు అనే అక్కసుతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడిని మహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. 15 రోజుల క్రితం మహ్మద్‌ తన కుటుంబంతో జీవనోపాధి కోసం నాందేడ్‌ నుంచి మిరుదొడ్డిలోని మోతెకు వలస వచ్చాడు. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరు కూతుళ్లతో ఉంటున్న అతను కొంత కాలంగా సైకోలా ప్రవర్తిస్తున్నాడు. దీంతో గ్రామస్తులు వారి కుటుంబాన్ని మోతె నుంచి వెల్లగొట్టడంతో చిట్టాపూర్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇంట్లో గొడవ జరిగింది. దీంతో తలుపులు మూసి కూతుళ్ళ గొంతు కొస్తానని బెదిరింపులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే ఇద్దరు కూతుళ్ళ గొంత కోయడానికి సిద్ధమైయ్యడు. సమయానికి పోలీసులు రావడంతో ఇద్దరి పిల్లలకు ప్రాణప్రాయం తప్పింది. ఈ క్రమంలో పోలీసులపైకి సైతం మహమ్మద్‌ దాడికి ప్రయత్నించాడు. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి చిన్నారులను కాపాడారు.

Other News

Comments are closed.