.సిద్ధిపేటే.. నా రాజకీయ జీవితం ప్రసాదించింది

share on facebook

 

ఆ వెలుగే తెలంగాణ ఆవిష్కరించింది

– సిద్ధిపేటపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

సిద్దిపేట బ్యూరో,డిసెంబరు 10 (జనంసాక్షి): సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందని సీఎం అన్నారు. ఇది మాములు పేట కాదన్నారు. ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదని సీఎం అన్నారు. ఆనాడు అవసరం రీత్యా కరీంనగర్‌ ఎంపీగా, సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీచేస్తే రెండింటిలో గెలిచాం. కానీ తెలంగాణ కోసం ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ కోసం నడుం కట్టి మిమ్మల్ని అందరినీ వదిలి అక్కడికి పోయిన. విూ పేరు నిలబెట్టి తెలంగాణ తెచ్చి ప్రజల చేతులో పెట్టాం. తెలంగాణనే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని చెప్పి మంచి ఆణిముత్యం లాంటి నాయకుడిని హరీశ్‌రావు విూకు అప్పగించా. నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేట తయారు చేశాడు. ఇది తన గుండెల నిండా సంతోషం నింపే అంశమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జిల్లాకు మరో వెయ్యి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు కెసిఆర్‌ ప్రకటించారు. అలాగే జిల్లాలోని రంగనాయకసాగర్‌ పర్యాటక అభివృద్దికి 100 కోట్ల రూపాయాలను ప్రకటించారు. ఇరుకోడు లిప్ట్‌ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు, సిద్దిపేటలో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు రూ.25 కోట్లు మంజూరు చేశారు. అలాగే 160 కోట్లతో రాజీవ్‌ రహదారిని విస్తరిస్తామని హావిూ ఇచ్చారు. నెలలోపు సిద్దిపేటలో బస్తీ దవఖానాను ఏర్పాటు చేస్తామన్నారు. అప్పట్లో కరెంట్‌ కష్టాలు ఉండేవని..తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంట్‌, నీటి సమస్య రాష్ట్రానికి సిద్ధిపేటకు తీరిపోయిందన్నారు. సిద్ధిపేట మంచినీటి వసతి నుంచి వచ్చిన స్కీం.. మిషన్‌ భగీరథ అని అన్నారు. రాష్ట్రంలో మంచి టూరిస్టు స్పాట్‌ రంగనాయక్‌ సాగర్‌ అని..దాని అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఇర్కోడు లిప్ట్‌ ఇరిగేషన్‌కు రూ.85 కోట్లు మంజూరు చేశారు. సిద్ధిపేట నుంచి ఇ/-లలెంతకుంట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్‌.ఇండియాకే రోల్‌ మోడల్‌ సిద్ధిపేట అన్న కేసీఆర్‌.. 22 గ్రామాలను కలుపుతూ 160 కోట్లతో రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొత్తగా మరో 1000 డబుల్‌ బెడ్‌ రూంల ఇళ్లతో పాటు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. టౌన్‌ హాల్‌ నిర్మాణానికి రూ.50 కోట్లు,ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు సిద్ధిపేట లో నెలరోజుల్లో బస్తీ దవాఖానాను ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. సిద్దిపేటకు నేడు ‘గోల్డెన్‌ డే’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. సీఎం కేసీఆర్‌ చేతుల విూదుగా దాదాపు రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నట్లు తెలిపారు. 2,460 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, ప్రభుత్వ వైద్య కళాశాల, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టం, రంగనాయక సాగర్‌ గెస్ట్‌హౌజ్‌ ఇలా పలు కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని చెప్పారు. సిద్దిపేట ముద్దుబిడ్డగా, శాసనసభ్యులుగా మన సిద్దిపేటకు రాష్ట్రంలోనే ఇంటింటికి తాగునీరు అందించారని, సిద్దిపేట నియోజకర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించిన తర్వాత మొదటిసారి సీఎం కేసీఆర్‌ విచ్చేశారని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సులు, కలెక్టర్‌, అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించికున్నట్లు తెలిపారు. బుల్‌ బెడ్‌రూం పథకం.. సీఎం కేసీఆర్‌ కల అని, ఇది ఎవరో అడిగింది కాదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో పాలకులు నిర్మించిన ఇండ్లు మురికి కూపాలు, స్లమ్‌లుగా ఉండేవని, పేదలంటే వారికి చిన్నచూపని అన్నారు. కానీ నేడు టీఆర్‌ఎస్‌ సర్కారు నిరుపేదలకు సకల సదుపాయాలతో కాళ్లకు మట్టి అంటకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని చెప్పారు. గేటెడ్‌ కమ్యూనిటీలను తలదన్నేలా డబుల్‌బెడ్‌రూంలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఇంటి నిర్మాణాలను తాను 400 సార్లు పరిశీలించానని, నాణ్యతతో కట్టేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రెండున్నరేళ్ల కృషి వల్ల నేడు గృహప్రవేశాలు చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ పథకంతో తన జన్మధన్యమైందన్నారు. అయితే, తమ పట్టణంలో ఇంకా కొంతమంది ఇండ్లు రానివారు ఉన్నారని, సీఎం కేసీఆర్‌ పెద్దమనసుచేసుకొని మరో వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంజూరుచేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. అలాగే, బస్తీ దవాఖానను కూడా మంజూరుచేయాలని సీఎంను వేడుకుంటున్నానన్నారు. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించాలని కోరుకుంటున్నాని మంత్రి చెప్పారు. రూ. 45 కోట్లతో ఐటీ టవర్‌ ఏర్పాటు చేస్తున్నామని, దాదాపు రెండువేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. స్థానిక నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని హావిూ ఇచ్చరు. ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన రోజే నాలుగు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తయ్యేదాకా ఎక్కడైనా వసతి కల్పిస్తే నెలలోగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెబుతున్నారన్నారు.. ప్రస్తుత కలెక్టరేట్‌లో ఈ ఐటీ కంపెనీలకు అవకాశం కల్పించి యువతకు ఉపాధి కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ను మంత్రి హరీశ్‌రావు కోరారు. సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ సిద్దిపేట గురించి ఆనాడే కలగన్నారని, అది ఇప్పుడు నెరవేరిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘స్వచ్ఛత అనేది దైవత్వంతో రాదు.. దైవత్వం లాంటిది ఆ పరిశుభ్రత’ అని గాంధీజీ అన్నారని, ఆ పరిశుభ్రత కోసం మనం నేడు అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. దాన్నీ నేడు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటకు హరితహారం అని ఆనాడు ప్రారంభిస్తే ఆరోగ్య సిద్దిపేట దిశగా మనం ముందుకు పోతున్నామని చెప్పారు. ఎటువైపు చూసిన ఆకుపచ్చ చెట్లతో హరిత సిద్దిపేటగా అవతరించిందని పేర్కొన్నారు. సిద్దిపేట నుంచి చిన్నకొడూరు వరకు ఫోర్‌ లైన్‌ రోడ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నా మన్నారు.. కోమటిచెరువుకు సైకిల్‌ ట్రాక్‌, నె/-లకెస్‌ రోడ్‌, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. నిధులు కేటాయించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌజింగ్‌, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రోజా రాధాకృష్ణశర్మ, శాసనసభ్యులు రసమయి బాలకిషన్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు బాలమల్లు, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, రాజనర్సు, ఫరూక్‌ హుస్సేన్‌, బూర రఘోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర రైతుబందు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, రవీందర్‌రెడ్డి, సిద్దిపేట నలుమూలల నుంచి తరలివచ్చిన అందరికి పేరు పేరును నమస్కారాలు తెలుపుతున్నానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

(నేడు హస్తినకు ముఖ్యమంత్రి)

– ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీ

– రైతు సంఘాల నేతలను కలిసే అవకాశం

హైదరాబాద్‌,డిసెంబరు 10 (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు విపక్ష నేతలను కలవనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌ కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్‌ పరిశీలించనున్నారు. వీలయితే శంకుస్థాపన కూడా చేస్తారు. ఒకవైపు హస్తినలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతిస్తూనే పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్‌ కలవనుండడం ఆసక్తికరంగా మారనుంది. కరోనా తరువాత కేసీఆర్‌ మొదటిసారిగా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ప్రధానితో సహా అనేకశాఖల మంత్రులను కేసీఆర్‌ కలవబోతున్నారు. జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయాన్ని బీజేపీ అడ్డుకుంది. ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి చెందిన ఢిల్లీ స్థాయినేతలు, మంత్రులు జీహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ పై విమర్శలు చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ బీజేపీని, ప్రధాని మోడీని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. శనివారం టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి పూజ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

హరీశ్‌ ఆణిముత్యం

– నా పేరును కాపాడిన నాయకుడు

– సీఎం కేసీఆర్‌

సిద్దిపేట బ్యూరో,డిసెంబరు 10 (జనంసాక్షి):తన పేరును కాపాడిన నాయకుడు హరీశ్‌ అని మంత్రి హరీశ్‌రావుపై సీఎం కేసీఆర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌ గురువారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హరీశ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. సిద్దిపేట నుంచి వెళ్లి తెలంగాణ సాధించా. సాధించి ప్రజల చేతుల్లో పెట్టా. తెలంగాణకే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని చెప్పి మంచి ఆణిముత్యం లాంటి నాయకుడిని హరీశ్‌రావుని విూకు అప్పగించా. సిద్దిపేట అభివృద్ధి చూస్తుంటే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. హరీశ్‌ నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశాడు. తన గుండెల్నిండా సంతోషం నిండి ఉందని సీఎం అన్నారు. సిద్దిపేటలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసిన హరీశ్‌ వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ.. హరీశ్‌ బాగా హుషారు ఉన్నడు. ఏవిూ లేవు.. విూరిచ్చిన కొన్ని కొన్ని మంచి పనులు పూర్తి అయినయి.. విూరొచ్చి రిబ్బన్లు కట్‌ చేసి పోతే చాలు.. ఏం అడగా అని హైదరాబాద్‌లో చెప్పిండు. కానీ ఇక్కడి వచ్చాక విూ ముందు నిలబెట్టి నిధులు మంజూరు చేయించుకుంటున్నడన్నారు. అదేవిధంగా రంగనాయకసాగర్‌ అభివృద్ధి గురించి సీఎం మాట్లాడుతూ ఇక్కడ నాయకుడు(హరీశ్‌రావు) గట్టోడు ఉన్నడు కాబట్టి దాన్ని గ్యారంటీగా సాధిస్తాడు. తనకేమాత్రం అనుమానం లేదన్నారు. ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే నియోజకవర్గం సిద్దిపేట అన్నారు. మంచి నాయకుడు, కిందిస్థాయిలో మంచి నాయకుడు ఉన్నాడు కాబట్టి చాలా గొప్పగా, అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొనా

Other News

Comments are closed.