సీఎం కేసీఆర్‌ను కలిసిన కామన్వెల్త్ విజేతలు

share on facebook

హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కామన్వెల్త్ విజేతలు ఇవాళ ఉదయం కలిశారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌ను సీఎం అభినందించారు. ఈ నెల 23న కామన్వెల్త్ విజేతలకు ఎల్బీ స్టేడియంలో సన్మానం, అభినందన సభ నిర్వహించనున్నారు. 5 రాష్ర్టాలకు చెందిన 18 మంది క్రీడాకారులు సీఎంను కలిశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారని క్రీడాకారులను సీఎం అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు సీఎం. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం అన్నారు.

Other News

Comments are closed.