30 ఏళ్ల తర్వాత తొలిసారి సిపిఐ పోటీ

ఖమ్మం నుంచి నారాయణ
హైదరాబాద్: ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ పోటీ చేయనున్నారు.  నారాయణ అభ్యర్థిత్వానికి సిపిఐ కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా, ఖమ్మం స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సిపిఐ ఖమ్మం జిల్లా కమిటీ, సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ కేంద్ర కార్యదర్శివర్గం నారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.దీంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మిగతా శాసనసభా నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులను త్వరలో విడుదల చేస్తామని 1984లో చివరి సారిగా ఖమ్మం లోక్ సభా నియోజకవర్గం నుంచి సిపిఐ కేంద్ర నాయకులు నల్లమల గిరి ప్రసాద్ పోటీ చేశారు.అదే ఎన్నికల్లో సిపిఎం తరుపున పర్సా సత్యనారాయణ పోటీ చేయడంతో 1984 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఖమ్మం లోక్ సభా నియోజకవర్గం నుంచి సిపిఐ పొటీ చేయడం 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటి సారి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పోటీ చేయడం కూడా ఇదే ప్రథమం కూడా.