అంకం సాగర్ కు ఆర్ధిక సాయం

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన అంకం సాగర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుండి ఆటో వచ్చి తగిలింది.ప్రమాదంలో కుడి చేయి,మోచేతి కిందభాగము విరిగిపోయింది.భుజం నాడీ ఒత్తిడికి గురైంది. అప్పటి నుండి కుడి చేతికి చలనం లేదు.హైద్రాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో కుడి చేతికి ఆపరేషన్ జరిగింది, కాని ఆపరేషన్ ఫెయిల్ అయింది. హైద్రాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సివచ్చింది.ఆ ఆపరేషన్ కు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏన్ వో సి ద్వారా లక్ష రూపాయలు ఇప్పించారు. నిమ్స్ హాస్పిటల్ లో ప్లాస్టిక్ సర్జరీ చేశారు.ఆ నిరుపేద కుటుంబానికి పోకబత్తిని రాజేష్ తన మిత్రుల ద్వారా రూ. 44 వేల రూపాయలు సేకరించి సోమవారం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. సహకరించిన మిత్రులకు రాజేష్ ధన్యవాదాలు తెలిపారు.