అంగడి బజార్ లో కొలువుదీరిన గణనాథుడు… ఘనంగా పూజలు నిర్వహించిన యువసేన యూత్ సభ్యులు

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 31:
మండలంలోని ఇందూర్తి గ్రామ అంగడి బజార్ లో యువసేన యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడు.బుధవారం యూత్ సభ్యులు వినాయక చవితి సందర్భంగా మొదటి రోజు డప్పు చప్పుళ్లతో ఘనంగా విగ్రహ ప్రతిష్ట చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.అనంతరం విగ్రహ దాతలు మల్లారెడ్డి,మనోజ్, శ్రీకాంత్ లను యువసేన యూత్ అధ్యక్షుడు గాదె రఘునాథ్ రెడ్డి,గౌరవ అధ్యక్షుడు కంతాల శ్రీనివాస్ రెడ్డి ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈకార్యక్రమంలో జర్నలిస్టు లు దాసు,భరత్, వార్డు సభ్యులు విష్ణు,యువసేన యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.