అంగన్వాడి లో “పోషణ్ పక్వాడ”
అంగన్వాడి లో “పోషణ్ పక్వాడ”
బోనకల్, మార్చి 24 (జనంసాక్షి):మధిర ప్రాజెక్టు పరిధిలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా అధిక పోషక విలువలు గల మిల్లెట్ల పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వాటిని వాడేందుకు ప్రోత్సహించాలని ఐసిడిఎస్ సిడిపిఓ శారద శాంతి అన్నారు.ఈనెల 20 నుండి ఏప్రిల్’ 3 వరకు అంగన్వాడి స్థాయి, గ్రామ స్థాయి, ప్రాజెక్ట్ స్థాయిలో నిర్వహించనున్న పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బోనకల్ మండలంలోని బోనకల్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోషణ్ పఖ్వాడ’2023లో భాగంగా ఆరోగ్యమైన పిల్లల పోటి వేడుకలు, మిల్లెట్స్ ను ప్రోత్సహించటం, మిల్లెట్స్ ప్రచారం అంశాలపై అంగన్వాడి కేంద్రాల లో పోషణ్ పఖ్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.గ్రామములోని ప్రజాప్రతినిదులను, గర్భిణీలు, బాలింతల ను ఆహ్వానించి స్థానికంగా లభించే మినుములు, మిల్లెట్స్ లో ఉండే పోషక విలువలను గూర్చి వివరించారు. పోషణ్ పఖ్వాడలో మిల్లెట్స్ రకాలు, ఆహారం యొక్క ప్రాముక్యత వైవిధ్యం పై తల్లులకు అవగాహన కల్పించారు .రక్తహీనత, ఐరన్, విటమిన్-సి లోపం ఏర్పడకుండా ఉండేందుకు అవి అధికముగా ఉండే ఆహారం, మిల్లెట్స్ పై అవగాహనా కల్పించారు. అన్ని అంగన్వాడి కేంద్రములలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. పాఠశాలలో రక్తహీనత శిబిరాలు నిర్వహించాలని, అంగన్వాడి కేంద్రము పరిధిలోని పిల్లలందరి పెరుగుదలపై పర్యవేక్షన, గ్రోత్ మానిటరింగ్ చేయాలని సూచించారు. పోషణ్ పక్వాడ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడి కేంద్రం పరిధిలోని బలహీనంగా ఉన్నటువంటి పిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ కమల ప్రియ ,సూపర్వైజర్ రమాదేవి, ఎంపీటీసీ రమేష్ ,అంగన్వాడీ టీచర్లు రమాదేవి ,శిరీష, నాగమణి ,ప్రసూనాంబ, ఆశా కార్యకర్తలు లీల కుమారి విజయ , పలువురు వార్డు మెంబర్లు, పలువురు గర్భిణీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.